📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: High Court: సైనిక వెల్ఫేర్ సహచర అధికారిపై దౌర్జన్యం: హైకోర్టు మండిపాటు

Author Icon By Rajitha
Updated: December 1, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : తన సహచర అధికారి పట్ల మరో అధికారి దౌర్జన్యంగా వ్యవహరించిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మజ్జి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించే ప్రయత్నం చేయడాన్ని ఆక్షేపించింది. అదే స్థానంలో ఉన్న మరో ఆఫీసర్ కెవిఎస్ ప్రసాదరావు పట్ల దౌర్జన్యంగా, దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుపట్టింది. తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రసాదరావును అదే స్థానంలో కొనసాగించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్లను ఆదేశించింది. కృష్ణారావు తీరు ఎపి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకమంది. విజయనగరం (vizianagaram) జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్ పి, వనౌన్ పిఎస్సిఐలను సుమోటో ప్రతివాదులుగా చేర్చింది. వీరితోపాటు ప్రభుత్వం, మజ్జి కృష్ణారావు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. విచారణను డిసెంబరు 2కు వాయిదా వేస్తూ జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఎ హరిహరనాథ శర్మతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.

Read also: Rayalaseema: రాయలసీమ వారసత్వ స్ఫూర్తిని కవులు సమాజానికి అందించాలి

High Court condemns assault on military welfare officer

ఈ నెల 27న స్టేటస్ కు ఆర్డర్

విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గ పనిచేస్తున్న మజ్జి కృష్ణారావు కాకినాడకు బదిలీ అయ్యారు. విజయనగరం జిల్లాకు కెవిఎస్ ప్రసాదరావు నియమితులయ్యారు. కృష్ణారావు కాకినాడలో జాయిన్ కాలేదు. తర్వాత విజయనగరంలోనే కొనసాగించాలంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీనిని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ అమలు చేయలేదని కృష్ణారావు హైకోర్టుకు వచ్చారు. హోంశాఖ ప్రొసీడింగ్స్ అమలు చేయాలని సింగిల్ జడ్జి గతంలో ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ప్రసాదరావు డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ చేశారు. తనను ప్రతివాదిగా కూడా చేయకుండా కృష్ణారావు పిటిషన్ వేస్తే సింగిల్ జడ్జి ఆర్డర్ ఇవ్వడం చెల్లదన్నారు. దీనిపై డివిజన్ బెంచ్ ఈ నెల 27న స్టేటస్ కు ఆర్డర్ ఇచ్చింది. ఈ సమయంలోనే కృష్ణారావు 20 మందితో దౌర్జన్యంగా వచ్చి ప్రసాదరావు చాంబర్లో చొరబడ్డారని న్యాయవాది చెప్పారు. ప్రసాదరావును సీటులోంచి లేపి బయటకు తోసేశారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, ఈ నెల 27న మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. దీనిపై ప్రసాదరావు న్యాయవాది స్పందిస్తూ, డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అందలేదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ap-news court-case latest news officer-misconduct Telugu News vijayanagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.