📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

High Court : నోటిఫై కాని స్టేషన్‌ల కేసులు చెల్లవు

Author Icon By Shravan
Updated: August 4, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : నోటిఫై కాని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు (High court) స్పష్టం చేసింది. నోటిఫై కాని స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నమోదు చేసిన 15 కేసులను రద్దు చేసింది. వీటికి సంబంధించిన ఎఫ్ఎఆర్లను కూడ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఆయా కేసులు నమోదు చేసే నాటికి విజయవాడలోని ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సిఐయూ) కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషణ్ జారీ చేయలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎసిబి సిఐ యూలో నమోదైన ఎఫ్ ఐఆర్లకు చట్టబద్దత ఉండదని పేర్కొంది. సదరు ఎఫ్ఆర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ తీర్పు ఇచ్చారు. ఆదాయానికి మించి ఆస్థులున్నాయనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 15 మంది అధికారులు, ఉద్యోగులపై విజయవాడలోని ఏసీబీ సిఐయూ కార్యాలయం ఎఫ్ఎఆర్ లు నమోదు చేసింది.

నోటిఫై కాని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినందున వాటికి ఎలాంటి చట్టబద్దత ఉండదని, వాటిని కొట్టివేయాలని కోరుతూ 15 మంది అధికారులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. పిటీష నర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… సిఆర్పీసీ సెక్షన్-2(ఎస్) ప్రకారం పోలీస్ స్టేషన్గా గుర్తించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విజయవాడలోని ఎసిబి సీఐయూ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఎటాంటి గెజిట్ నోటిఫి కేషన్ ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ… సాంకేతిక కారణాలు చూపి ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలని కోరలేరని తెలిపారు. ఎసిబి విభాగంలోని జాయింట్ డైరెక్టర్ల కార్యాలయాలను పోలీస్ స్టేషన్లుగా గుర్తిస్తూ 2003లో ప్రభుత్వం జిఒ ఇచ్చిందన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 101,102 ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం ఆ చట్టాలు అమల్లో ఉంటాయని తెలిపారు. విజయవాడ లోని ఏసీబీ సీఐయూ కార్యాలయాన్ని పోలీస్టేషన్గాగా నోటిఫై చేస్తూ 2022లోనే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, కేసులు నమోదు చేసేందుకు వాటికి తాత్కాలికంగా అర్హత ఉంటుందన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read more :

https://vaartha.com/tirumala-darshan-darshan-is-difficult-for-a-common-man/andhra-pradesh/525417/

2016-2020 Cases ACB Cases Breaking News in Telugu High Court Judgement Latest News in Telugu Police Station Notification Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.