📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

High Court: సంక్షేమ హాస్టళ్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, బిసి, గురుకుల హాస్టళ్ల (Gurukul hostels) పరిస్థితి దయనీయంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలు చదవుకునే హాస్టళ్ల దుస్థి తిపై విస్మయం వ్యక్తం చేసింది. బెడ్లు, బెడ్ షీట్లు, దిండ్లు ఇవ్వడం లేదని, తాగునీరు, పౌష్టికాహారం కూడా సరిగ్గా లేదని ఆక్షేపించింది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు మరుగుదొడ్లు, బాత్రూములు లేక పోతే ఎలాగని ప్రశ్నించింది. ఉన్నవి కూడా వాడు కునేలా లేవంది. హాస్టల్ బిల్డింగ్స్ కూలిపోయే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైనా జరిగితే అందులోని విద్యార్థుల పరిస్థితి ఏం కావాలని అధికారులను నిలదీసింది.

228 మందికి ఒకటే మరుగుదొడ్డి

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వం నిర్వహించే 65 హాస్టళ్లను పరిశీలించిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. నర్సీపట్నంలోని బాలిక హాస్టల్లో (Girls hostels) 228 మంది విద్యార్థినులుంటే ఒకే ఒక్క మరుగుదొడ్డి, ఒక్కటే బాత్రూమ్ ఉంది. విజయ నగరంలోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో 33 మంది విద్యార్థులుంటే అసిస్టెంట్ పోస్టులన్నీ ఖాళీగాఉన్నాయి. విజయనగరంలోని ఒక ప్రభుత్వ హాస్టల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థినులు 168మంది ఉంటే, 16 మంది ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. పదిగదులేఉన్నాయని హైకోర్టు (High Court) చెప్పింది. ఈ ఏడాది సాంఘిక సంక్షేమ, బిసి, గురుకుల హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.633 కోట్లు కేటాయించిందని, అయినా పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గైడ్లైన్స్ ప్రకారం ఎంత మేరకు నిధులు అవసరమో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది .

హైకోర్టు సంక్షేమ హాస్టళ్లపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది?


హాస్టళ్లలో మౌలిక సదుపాయాల లేమి, అనారోగ్యకర వాతావరణం, విద్యార్థుల ఆరోగ్యాన్ని గమనించకుండా అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు హాస్టళ్లను పరిశీలించిన నివేదికల్లో దారుణ పరిస్థితులు వెలుగుచూశాయి.

హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది?


హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హాస్టళ్లను శుభ్రపరచడం, తినే ఆహార నాణ్యత పెంపొందించడం, విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అవసరమైతే ఆఫీసర్లపై బాధ్యత నిశ్చయించాలని సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Hyderabad-Vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు లేన్లుగా విస్తరణ

Breaking News Government Welfare Institutions High Court on Welfare Hostels Hostel Sanitation Problems latest news Student Safety in Hostels Telugu News Welfare Hostel Conditions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.