📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest Telugu News: Hidma maoist: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం ..పట్టుకొని చంపారు: సంచలన లేఖ

Author Icon By Vanipushpa
Updated: November 21, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా (Hidma Maoist) మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులపై పోలీసులు సాధించిన కీలక విజయంగా ఈ ఎన్‌కౌంటర్‌ను కేంద్ర హోం అమిత్ షా పేర్కొన్నారు. ఇక హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీ అంతమయ్యే స్థితికి చేరుకుందిని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మా ఎన్‌కౌంటర్ పుర్తిగా కట్టు కథ అని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ చేసిన కుట్రగా దీన్ని అభివర్ణించింది. హిడ్మాను ఓ మహోన్నత వ్యక్తిగా పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి.. అభయ్ పేరిట లేఖ విడుదలైంది.

Read Also: AP: వైఎస్ జగన్ నుండి చంద్రబాబు నాయుడుకు లేఖ

Hidma encounter hoax…caught and killed

కేంద్రం డైరెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్..

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా, కామ్రేడ్ రాజే, శంకర్‌తో పాటు మరికొందరిని.. విజయవాడలో నవంబర్ 15న నిరాయుధులుగా ఉన్న సమయంలో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లిన క్రమంలో.. ద్రోహుల వల్ల సమాచారం లిక్ అయ్యి.. నవంబర్ 15 పోలీసులకు పట్టుబడ్డట్లు తెలిపారు. ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. అతి క్రూరంగా హత్య చేశారని.. అనంతరం ఎన్‌కౌంటర్ అని కట్టు కథ అల్లారని ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఆదేశాలు, డైరెక్షన్‌లో ఏపీ ఎస్ఐబీ (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) ఇదంతా చేసిందన్నారు. ఈ క్రూరమైన హత్యకు వ్యతిరేకంగా.. నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

హిడ్మాను దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారన్నారు

కామ్రేడ్ హిడ్మా మొదటి నుంచి ప్రజల్లో పనిచేస్తూ, ప్రజల నుంచి నేర్చుకుంటూ ఎదిగాడని.. మావోయిస్టు పార్టీలో కూడా రాజకీయంగా, సైద్ధాంతికంగా అంచెలంచెలుగా ఎదిగాడని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. కార్పొరేట్ మీడియా, గోదీ మేధావులు ఎప్పటి నుంచో హిడ్మాను దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రచారాలు ఎంత చేసినా ప్రజల హృదయాల్లో హిడ్మాకు గౌరవ స్థానం చెరగదని.. కొమురం భీం, అల్లూరి, భగత్ సింగ్, గూండదండూర్, గండ సింగ్, అల్లూరి సీతారామరాజు.. వంటి మహానుభావుల చరిత్రలాగే.. హిడ్మా చరిత్ర కూడా భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేస్తుందని పేర్కొన్నారు.

హిడ్మా పై బహుమతి ఎంత?
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలపై జరిగిన వివిధ దాడులకు, 2013లో దర్భా లోయలో జరిగిన నక్సలైట్ దాడికి హిడ్మా బాధ్యత వహించాడు. అతను జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఉన్నాడు. అతను మరణించే సమయంలో ₹1 కోటి కంటే ఎక్కువ బహుమతిని పొందాడు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Chhattisgarh police extrajudicial killing fake encounter Google News in Telugu Hidma encounter Human Rights Madvi Hidma Maoist leader Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.