📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Thunderstorms : ఏపీలో భారీ వర్షాలు.. 8 మంది మృతి

Author Icon By Sudheer
Updated: May 5, 2025 • 7:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. పిడుగుల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రాణ నష్టం సంభవించింది. తిరుపతి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. అలాగే ఏలూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మరణించగా, మరొకరు చెట్టు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరుకుంది.

అకాల వర్షాలతో ప్రాణ , ఆస్తి నష్టాలు

వర్షాలు కేవలం ప్రాణ నష్టాన్ని కాకుండా, ఆర్థికంగా కూడా రైతులను తీవ్రంగా నష్టపెట్టాయి. ధాన్యం కోత పూర్తయ్యే సమయంలో ఈ వర్షాలు రావడంతో, భద్రపరిచిన ధాన్యం తడిసిపోయి నాణ్యత కోల్పోయింది. ఇదే విధంగా అరటి, బొప్పాయి, మామిడి పంటలు ఈదురుగాలులతో నేలరాలిపోయాయి. దీంతో పంటలపై పెట్టుబడి వేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేసేందుకు సంబంధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలపై గమనించి, తక్షణ సహాయ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Read Also : India : రష్యా నుంచి ఇగ్లా-ఎస్ స్వల్ప శ్రేణి క్షిపణుల సేకరణ

8 people died Ap Google News in Telugu Heavy Rains Thunderstorms

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.