హైదరాబాద్ : మహారాష్ట్ర కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో గలగలా గోదారి కదిలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది. మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీరా నది ఉదృతి కొనసాగుతోంది. దీంతో వన దుర్గామాత ఆలయాన్ని తీసుకుని భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 1.09 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .గోదావరి బేసిన్ లోని మొగలి గుండ్ల బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టులో(Bagareddy Singur Project) నీటి మట్టం 18.48 టిఎంసిలకు చేరుకోగా 88827 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి ఎగువనుంచి వస్తోంది. బయటకు 97361 క్యూసెక్కులు వదులుతున్నారు.
Read Also: Crime: ఏడేళ్ల బాలికను హతమార్చిన మేనమామ, అత్త
నిజామసాగర్కు 108774 క్యూసెక్కుల వరద వస్తుంటే బయటకలు 126640 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆప్రాజెక్టులో 14.63 టిఎంసిలు నీరు ప్రస్తుతం నిలిచిఉంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టులో 70 టిఎంసిల నీరు నిండివుండగా 2,40,000 క్యూసెక్కుల నీరు పైనుంచి వరదగా వస్తుంటే బయటకుల109394క్యూసెక్కుల నీరు కింది వదులుతున్నారు. ఆదినారాయణరెడ్డి కడెం ప్రాజెక్టులో 4.7 టిఎంసీలు నీరు ఉంది ఇక్కడ పెద్దగా వరదరాకడ, పోకడలు లేవు. గోదావరికి అడ్డంగా కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి మాత్రం 20.18టిఎంసిల నీటిని నింపుకొని నిండు కుండలా కనపడుతోంది. 2,58,332 క్యూసెక్కుల వరద నీరు ఎగువనుంచి వస్తుంటే దిగువకు 242915 క్యూసెక్కులు వదులుతున్నారు.
పార్వతి 550750 క్యూసెక్కుల వరదజలాలు చేరుకొని బయటకు అంతేమొత్తం దిగువకు వెళ్ళుతున్నాయి. సరస్వతి బ్యారేజికి కూడా 4,06,724 క్యూసెక్కుల వరదనీరు చేరుకొని అంతే మొత్తం కిందికి పోతున్నది. లక్ష్మీబ్యారేజి నుంచి 6,07,700 క్యూసెక్కుల వరదనీరు వెళ్ళుతోన్నది. సమ్మక్క సాగర్కు వచ్చిన 5,54490 క్యూసెక్కుల వరద నీరును కూడా అంతె మొత్తం కిందికి వదులు తున్నారు. సీతమ్మసాగర్ కు 8,85,673 క్యూసెక్కులు వరదనీరు రాగా అంతే మొత్తం కిందికి వదులుతున్నారు. అల్మట్టిలో 126.72 టిఎంసిల నీరు ఉండగా 56121క్యూసెక్కులు వరదగా వస్తోంది బయటకలు 44385 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్లో 37.645 నీరు నిల్వఉండగా 56423 క్యూసెక్కులు వరదగా వస్తుంటే కిందికి 46244క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. తుంగభద్రలో 80.79 టిఎంసిల నీరు వచ్చిచేరి నిల్వ ఉండగా ఇంకా పైనుంచి13411క్యూసెక్కుల వదర వస్తుండగా కిందికి అంతే మొత్తం వదులుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో 9.11 టిఎంసిల నీరు ఉంది. ప్రియదర్శిని జూరాలకు 2.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తోంది.
దిగువకు 2.77లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. కృష్ణా నది జూరాల నుంచి ఉదృతంగా ప్రవహిస్తూనే ఉంది. ప్రాజెక్టుకు స్థిరంగా వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు(Srisailam project) వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోపలికి 2,95,563 క్యూసెక్కులు వరద వస్తుంటే, ఔట్ ఫ్లో 3,46, 374 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం 10 స్పిల్ వే గేట్లు ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 209.15 టిఎంసిలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం సామర్థ్యం 312.04 టిఎంసి లు కాగా, ప్రస్తుతం 302.91 టిఎంసిలు ఉంది జలాశయం నిండుకుండలా మారింది. దీంతో సాగర్ 22 గేట్లు ఎత్తి దిగువకు 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్రా 2.94 లక్షల క్యూసెక్కులు, ఔట్స్లో 2.22 లక్షల క్యూసెక్కు లుగా ఉంది. పులిచింతలలో 40.73 టిఎంసిల నీరు నిలిచి ఉండగా రెండులక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తున్నది. బయటకు 2.15లక్షల క్యూసెక్కుల వరద బయటకు పంపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: