📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Hasina : భారత్ చేతిలో హసీనా భవిత!

Author Icon By Sudha
Updated: November 20, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సొంత దేశంలో కల్లోలానికి కారకురాలై పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసినాకు ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణదండన విధించింది. ఇదేమీ ఊహించనిది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా చట్టా నికి ఎవరూ అతీతులు కారన్నది న్యాయ పరిభాషలో, ప్రాథమిక సూత్రంగా వర్తిస్తుంది. లోకకళ్యాణం కోసం దేశాధినేతలు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజాదరణ పొంద కపోవచ్చు. కానీ అంతమాత్రాన వాళ్లు దేశ విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పడం సాహసమే అవుతుంది. హసీ నా ఏదో అల్లాటప్పా రాజకీయాలు చేసుకునే చిన్నస్థాయి కుటుంబం నుంచి వచ్చిన మహిళ కాదు. ఆ దేశ ఏర్పాటు లో, నిర్మాణంలో ప్రగతిలో పాలు పంచుకున్న బంగ్లా జాతిపిత షేక్ ముజిబుల్ రహ్మన్ కూతురు. ఎంతో కొంత దేశభక్తి లేకుండా ప్రధాని బాధ్యతలు స్వీకరించా రంటే నమ్మలేం. ఆ కుటుంబం చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా అవతరించేందుకు ముజిబుర్ చేసిన కృషి ఎనలేనిది. ప్రజల్లోంచి ఉద్యమాలు వచ్చిన ప్పుడు వాటిని సానునయంగా పరిష్కరించడమో, అది సాధ్యం కానప్పుడు వాటిని అణచివేయడమో ప్రభుత్వాలు చేయగలిగిన పని. ఆమె కూడా అదే చేశారు. అయితే కొన్ని నిర్ణయాలు ప్రజలకు రుచించకపోయి ఉండవచ్చు. వాటినే బూచిగా చూపి విపక్షాలు కూడా జనాన్ని చైతన్య వంతుల్ని చేసి ముందుకురికించే శ్రమ తీసుకున్నారేమో అనిపిస్తుంది. బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యో గాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో నిరుద్యోగులు, విద్యార్థు ల్లో ఆందోళన రేకెత్తింది. అదే ఉద్యమానికి దారి తీసింది. జూలై 15న విద్యార్థులు ఉవ్వెత్తున చేసిన తిరుగుబాటు ను ఉక్కుపాదంతో అణచివేయాలని హసీనా (Hasina)తీర్మానించారు. అయితే ఎకక్కడో లౌక్యం, చాణక్యం బెడిసికొట్టి 1400 మంది మృతికి ఆ నిర్ణయం కారణమైంది. మానవత్వాన్ని మరచి ఎంతో మంది బలైపోవడానికి ఆమె నిర్ణయం దారితీసినందుకు జనాగ్రహం వ్యక్తమైంది. ఉద్యమాన్ని అణచివేత వ్యూహాలకు కర్త, కర్మ, క్రియా హసీనాయేనని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం అభియోగాలు మోపింది. కాగా ఉద్యమ సమయంలో ఉద్యమ కారులపైకి హసినా తమ సొంత పార్టీ అవాలీ లీగ్ కార్యకర్తలను కూడా ఉసికొల్పారని అభియోగం. ప్రజాస్వామ్య పునాదుల పునరుద్ధరణకు తాము కృషి చేస్తు న్నామని చెప్పుకునే తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహ మ్మద్ యూనస్ మాత్రం హసీనాకు పడిన మరణ శిక్ష సబబే అని వ్యాఖ్యానించారు. కాగా ఇది పూర్తిగా రాజ కీయ ప్రేరేపిత తీర్పుయని, ఒక అనామిక ప్రభుత్వం ఒత్తిడితో వెల్లడైన తీర్పుగా హసీనా (Hasina) పేర్కొన్నారు. 1975 లో సైనిక తిరుగుబాటులో తల్లిదండ్రులు, ముగ్గురు సోద రులు, మరికొందరు కుటుంబ సభ్యులు కూడా హతమ య్యారు. అనంతరమే ఆమె దేశ రాజకీయాల్లోకి ప్రవేశిం చాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ ట్రిబ్యునల్ ఆనాటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు కూడా మరణశిక్ష విధించారు. మాజీ ఐజి చౌదరి అబ్దుల్లా అల్ మమూలు ఐదేళ్ల శిక్ష పడింది. ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ పాలకుల పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉద్యమించినప్పుడు, వారిని నయానో, భయానో దారిలోకి తెచ్చు కోవాలని ప్రయత్నించడమూ జరిగేదే. అది ప్రభుత్వ బాధ్యత. తాత్కాలిక ప్రభుత్వం కూడా ఆనాటి ఉద్యమకా రులకు చేసిందేమీ లేదు. కానీ హసీనాకు శిక్షపడిందంటేనే అది వారికి న్యాయం జరిగినట్లు భావించాలనిచెబుతోంది. ఇదిలా ఉంటే హసీనాకు శిక్ష అయితే వేయగలిగారు కానీ ప్రస్తుతం ఆమె ఇండియా ఆశ్రయంలో ఉంది. ఎక్కడో రహస్యంగా దాక్కోలేదు. భారత ప్రభుత్వం రక్షణ కల్పి స్తోంది. బంగ్లాలో నిరసనకారులను చిత్రహింసలకు గురి చేయడం నిరాయుధ విద్యార్థులపైకి మారణాయుధాలతో దాడి చేసిన చర్యలకు జవాబుదారీగా ఆమెను ట్రిబ్యునల్ అభిశంసించింది. విద్యార్థులపై దాడి జరిపేటట్లుగా హసీనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిందని మరో ఆరోపణలున్నా యి. ఏదిఏమయినా ముస్లిం దేశాలలో అధికారపక్షాన్ని తిరుగుబాటుతో కూలదోయటమనేది తరచు జరిగే ప్రక్రి య. గతంలో ఆయాప్రభుత్వాలను సైన్యమే కూలదోసేది. ప్రస్తుత బంగ్లాదేశ్ విషయం వేరు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణ యాలను అమలు చేసిన సైన్యం కూడా మాటపడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా భారత్లో ఉన్న ఆమెను ఎలా గైనా స్వదేశానికి రప్పించుకొని మరణశిక్ష అమలు చేయా లని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొత్త వ్యూహాలు పన్నుతోంది. బంగ్లాదేశ్లో మరణశిక్ష విధించబడిన షేక్ హసీనాను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికేభారత్కు విజ్ఞప్తిచేసింది. భారత్, బంగ్లా దేశ్ల మధ్య ఉన్న ఒప్పందం మేరకు షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ లను తమకు అప్పగించడమే తక్షణ కర్తవ్యమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు కర్తవ్యబోధ చేస్తోంది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలు కాపాడే దిశగా శాంతి ప్రజాస్వామ్యం స్థిరత్వం కలిగేటట్లు తమ దేశనిర్ణయాలు ఉంటాయని భారత్ ప్రకటించింది. ఈ రెండు దేశాల మద్య ఉన్న ఒప్పందంలోని ఆర్టికల్ ‘6’ ప్రకారం హత్య, ఉగ్రవాదం, వంటి తీవ్రమైన నేరాలు మినహా రాజకీయ స్వభావమున్న నేరాల్లోని నిందితులకు అప్పగించకుండా
భారత్ తిరస్కరించే అవకాశముంది. పరస్పర అప్పగింత సందర్భాలలోను 1962 ఒప్పందంలోని సెక్షన్ 29 ప్రకారం రాజకీయ ప్రేరేపిత ఒప్పందాలకు తిరస్కరించే అధికారం భారత్కు ఉంది. హసీనా భవితవ్యం ఇప్పుడు భారత్ దేశ నిర్ణయం మీద ఆధారపడి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bangladesh politics Breaking News Hasina News India Bangladesh relations latest news Sheikh Hasina South Asia politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.