📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టులో హర్షకుమార్ పిల్

Author Icon By Shobha Rani
Updated: June 19, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో మాజీ ఎంపీ హర్షకుమార్‌(Harsha Kumar) కు హైకోర్టు (High court) షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ (Harsha Kumar) పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం నిన్న విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది బి. బాల వాదనలు వినిపిస్తూ, పాస్టర్ ప్రవీణ్ మరణంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
హైకోర్టు ధర్మాసన ప్రశ్నలు & వ్యాఖ్యలు
ఈ క్రమంలో ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ప్రవీణ్ హత్యకు గురయ్యాడనేందుకు ఆధారాలు ఉన్నాయా అని పిటిషనర్ హర్షకుమార్ (Harsha Kumar) తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అంతేకాకుండా మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్లు ఫోటోలు, ఆ తర్వాత వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని, ఆ రెండు చర్యలు ప్రమాదకర కలయిక అని వ్యాఖ్యానించింది.
హర్షకుమార్ దాఖలు చేసిన పిల్ ఏమిటి?
పిల్ వేయడానికి పిటిషనర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కారు కదా అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రెండు పిల్‌లు దాఖలై ఉండగా, మరో పిల్ వేయాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద రెండు వారాల్లో రూ.5 లక్షలు జమ చేయాలని హర్షకుమార్‌(Harsha Kumar) ను ఆదేశించింది. సొమ్ము జమ చేసిన తర్వాత పిల్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది. గతంలో దాఖలైన పిటిషన్లతో దీనిని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టులో హర్షకుమార్ పిల్

హర్షకుమార్‌కు ఖర్చుతో కూడిన ఆదేశం
PIL విచారణకు ముందుగా రూ.5 లక్షలు హైకోర్టు రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని ఆదేశించింది. ఈ సొమ్ము జమ చేసిన తర్వాత మాత్రమే వివరణాత్మక విచారణ జరుపుతామని పేర్కొంది. పైగా, ఇప్పటికే ఉన్న రెండు PILలతో ఈ పిటిషన్‌ను కలపాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. హైకోర్టు స్పందన ద్వారా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను వినిపించడంలో న్యాయ సమర్థత, ఉద్దేశ్యం ఉన్నాయా అనే అంశాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హర్షకుమార్ (Harsha Kumar) వేసిన PILపై తగిన ఆధారాలు లేకపోతే విచారణ ముందుకెళ్లదని సంకేతం ఇచ్చింది.

Read Also: Anil Chauhan: భారత సముద్రతీర రక్షణకు నూతన శక్తి: అనిల్ చౌహాన్

#HarshaKumar #highcourt #PastorPraveen #telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Harsha Kumar files PIL in High Court Latest News in Telugu Paper Telugu News Pastor Praveen's death PIL Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.