విజయవాడ : రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా 3850 క్యూసెక్కుల నీరు తర లించే పనులు పూర్తయినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రీనీవా (Handri-Neeva) వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి పై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో పూర్తి చేయలేని ఈ పనులను తాము సంవత్సరం వ్యవధిలో పూర్తిచేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
హంద్రీనీవా ఫేజ్2లో కూడా 3850 క్యూసె క్కులు తరలించేందుకు హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు, లైనింగ్ పనులు పూర్తి కావొ చ్చాయని ఆయన వివరించారు. హంద్రీనీవా కాలువ కృష్ణాజలాలతో నిండుగా ప్రవహిస్తుంటే రాయలసీమ (Rayamaseema) ప్రజలు హారతులతో స్వాగతం – పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
పుంగనూరు, కుప్పం బ్రాంచెకెనాల్ పనుల పురోగతి విషయంలో సకాలంలో స్పందించనందుకు ఇద్దరు ఇఇలకు మెమోలు జారీ చేయాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్ లైనింగ్, బెంచింగ్ పనులు ఆలస్యం కాకుండా 2026 జూన్ కల్లా పూర్తయ్యేలా పను లు చేయాలని అధికారులు, ఏజెన్సీల ప్రతినిధు లను ఆదేశించారు.
వెలిగొండ ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్వాల్ పనులకు వెంటనే టెం డర్లు పిలవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పూర్తికాని వెలిగొండను జాతికి అంకితం అంటూ గత పాలనలో జగన్ మోసం, దగా చేశాడన్నారు. మనం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో అన్నారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, అడ్వైజర్ ఎం. వెంకటేశ్వర రావు, ఈఎన్సి నరసింహమూర్తి, ఆయా ప్రాజె క్టుల సీఈలు, ఎస్ఐలు, ఇఇలు, ఏజెన్సీల ప్రతి నిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Development : ఎపి సముద్ర తీరం… అభివృద్ధికి ముఖ ద్వారం – మంత్రి లోకేష్