Ayesha Meera Case Updates: రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!

Read Time:  1 min
Ayesha Meera Case Updates: రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!
FONT SIZE
GET APP

Ayesha Meera Case Updates: దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేసు విచారణలో భాగంగా రీ-పోస్టుమార్టం నిమిత్తం సీబీఐ అధికారులు సేకరించిన ఆమె శరీర అవశేషాలను శుక్రవారం (ఫిబ్రవరి 27వ తేదీ) ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. విజయవాడ సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరగనుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ కుమార్తె అవశేషాలను అందుకుంటున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also: Rajampet Fire Accident: రాజంపేటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

handover-of-ayesha-meeras-remains-tomorrow-heavy-security-in-tenali
handover-of-ayesha-meeras-remains-tomorrow-heavy-security-in-tenali

తెనాలిలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు

విజయవాడ సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు తెనాలిలోని ఖబర్‌స్తాన్‌లో అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటలోపు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీని ఆదేశించారు. మరోవైపు, 19 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు మద్దతుగా న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాలు ‘చలో తెనాలి’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. విజయవాడ నుంచి పెద్ద ఎత్తున తెనాలికి తరలిరానున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.