విజయవాడ Handloom Workers : సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైందని మంత్రి సవిత (Minister Savita) తెలిపారు. నేతన్నల అభివృద్ధికి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ ప్రభుత్వం సదుపాయం కల్పిస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోంది. అదే సమయంలో ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల ద్వారా అమ్మకాలు ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్‌లను సిద్ధం చేసింది.
ఈ-కామర్స్ ద్వారా చేనేత అమ్మకాల విస్తరణ
నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ కామర్స్ హవా. ఇంటి దగ్గర నుంచే వినియోగదారులు సరుకులు కొనుగోలు చేస్తుండడంతో ప్రభుత్వం చేనేత వస్త్రాలను ఈ కామర్స్‌లో అందుబాటులో ఉంచింది. డోర్ డెలివరీ సదుపాయం కల్పించి, తక్కువ సమయంలో రూ.45 లక్షల విలువైన వస్త్రాలు విక్రయించబడినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 92 ఆప్కో షోరూమ్‌లు ఉన్నాయి. గత ఏడాది ఐదు కొత్త షోరూమ్‌లను ప్రారంభించారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఈ 40 ఆప్కో షోరూమ్‌లను అనుసంధానం చేశారు.
నూతన డిజైన్లు, మార్కెటింగ్ ఒప్పందాలు
చేనేత ఉత్పత్తులకు వినియోగదారుల ఆకర్షణ పెరగడంతో ప్రభుత్వం నూతన డిజైన్లతో రెడీమేడ్ వస్త్రాలను రూపొందిస్తోంది. వధువరుల కోసం దోతీలు, మోడి జాకెట్లు, చీరలు, షర్టులు, కుర్తాలు, పిల్లల దుస్తులు వంటి విభిన్న డిజైన్లను తయారు చేసి విక్రయిస్తోంది. కలంకారీ, పెన్ కలంకారీ, డిజిటల్ ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ చీరలను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ కామర్స్‌లో చేనేత అమ్మకాల విస్తరణతో నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. కోఆప్టెక్స్, టాటా తనేరియా, ఆదిత్య బిర్లా గ్రూప్ (Birla Group) వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చి, ఆన్‌లైన్ అమ్మకాలను మరింత విస్తరించింది. నేతన్నలకు శిక్షణ అందించి, చేనేత రంగానికి ఉత్సాహం కల్పించిందని మంత్రి తెలిపారు.
చేనేత అమ్మకాలు ఎలా పెరిగాయి?
ఈ కామర్స్ ద్వారా అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్ వంటి సంస్థలతో అనుసంధానం చేసి, డోర్ డెలివరీ సదుపాయం కల్పించడం వల్ల చేనేత అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
చేనేత రంగంలో కొత్త డిజైన్లు ఎందుకు ప్రవేశపెట్టారు?
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్లతో రెడీమేడ్ వస్త్రాలను అందించడం ద్వారా యువత, పిల్లలు, మహిళలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడమే లక్ష్యం.
Read hindi news : hindi.vaartha.com
Read also :