📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

News telugu: handloom weavers: నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు

Author Icon By Sharanya
Updated: September 13, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. ఈ మేరకు రూ.2,00,32,615.41లను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చింది.

News telugu

రాష్ట్ర స్థాయిల్లో చేనేత బజార్లు

చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు పెంచేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చేనేత బజార్లు నిర్వహిస్తోంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడు(Tamil Nadu)కు చెందిన కో ఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకుంది. 93 వేల చేనేత కుటుంబాలుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 11,488 మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తోంది. 50 ఏళ్లు నిండిన 92,724 మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తోంది. నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. ఆప్కోకు వస్త్రాలు విక్రయించే నేతన్నలకు అయిదు శాతం జీఎస్టీ మినహాయిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల తయారీలో శిక్షణిస్తూ, ఉత్పత్తులను ఆప్కో, ఈ కామర్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. కేవలం 15 నెలల కాలంలో నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా, గౌరవప్రదమైన జీవనం సాగించేలా కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రూ.2 కోట్లకుపైగా బకాయిల చెల్లింపు: రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కార్యక్రమాలు చేపడుతూనే, ఆప్కో ద్వారా బకాయిలు కూడా చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 84 చేనేత సొసైటీల నుంచి ఆప్కోవస్త్రాలను కొనుగోలు చేస్తుంటుంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసే వస్త్రాలను ఆప్కో షోరూమ్ లు, ఈ కామర్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తక్షణమే ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిలను చెల్లిం చాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

మంత్రి ఆదేశాలకనుగుణంగా మొదటి విడతగా ఆప్కో అధికారులు రూ. 2,00,32,615.41లను శుక్రవారం విడుదల చేశారు. ఈ నిధులు ఆయా చేనేత సొసైటీల ఖాతాల్లో జమకానున్నాయి. రాష్ట్రంలో ఏడుడివిజన్లలో 84 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలకు మొదటి విడ తగా రూ.2,00,32,615.41లబకాయిలు చెల్లించారు. శ్రీకాకుళం డివిజన్లలో ఉన్ననాలుగు సొసైటీలకు రూ.7,57,142లు, విజయనగరం డివిజన్లలో ఉన్న ఏడుసొసైటీలకు రూ. 2 3,44,007ల బకాయిలు విడుదలచేశారు. రాజమండ్రి డివిజన్లో 27 సొసైటీలకు 61,07,690, విజయవాడ డివిజన్లో ఉన్న 21 సొసైటీలకు రూ. 48,29,780లు చెల్లించారు. తిరుపతి డివిజన్లో 17 .36,64,628 , కడప డివిజన్లో ఉన్న 5 డివిజన్లకు .40,30,894 బకాయిలు విడుదల చేశారు. కర్నూలు డివిజన్ లో ఉన్న ఏడు సొసైటీలకు రూ.2,98,472ల మొదటి విడత బకాయిలు చెల్లించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-atchannaidu-fertilizer-supply-update/andhra-pradesh/546378/

APCOdues Breaking News HandloomWeavers latest news Netanna Telugu News WeaversPayment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.