📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Handloom – చేనేత ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ తో కూడిన వీవర్ కార్డు – మంత్రి సవిత

Author Icon By Shravan
Updated: September 5, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Handloom : దేశంలో అన్ని ప్రాంతాల నుంచి విభిన్న రకాల చేనేత వస్త్రాలను నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా చేనేత మరియు హస్తకళల ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి ఎస్. సవిత తెలిపారు. నగరంలో శ్రీ శేష సాయి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన “గాంధీ బునకర్ మేళా” (జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన – 2025) ను గురువారం మంత్రి ఎస్. సవిత, ఆంధ్రప్రదేశ్ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి సందర్శించారు.

నేతన్నల సంక్షేమానికి చర్యలు

ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత (Minister S. Savita) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైందన్నారు. నేతన్నల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేతన్నలను ఆదుకునేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి నెలా చేనేత, హస్తకళల అభివృద్ధికి ఎగ్జిబిషన్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Handloom – చేనేత ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ తో కూడిన వీవర్ కార్డు – మంత్రి సవిత

చేనేతకు పెరుగుతున్న ఆదరణ

ముఖ్యంగా తయారీదారులే ప్రత్యక్షంగా చేనేత ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే చేనేత వస్త్రాలు లభిస్తాయన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) వరకు చేనేతకు ఆదరణ కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నేతన్నలకు నెలకు రూ.4,000 పెన్షన్ ను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా 90 శాతం సబ్సిడీతో ఉపకరణాలు అందించటంతోపాటు లేటెస్ట్ డిజైన్స్ కు సంబంధించి శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు. ఆప్కో ద్వారా పలు డిజైన్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రజల్లో కూడా చేనేత వస్త్రాలు ధరించేలా అవగాహన పెరుగుతోందన్నారు. నేతన్నలను ఆదరించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతి వారం చేనేతను ధరిస్తున్నారన్నారు.

గాంధీ బునకర్ మేళా ఎక్కడ నిర్వహించారు?
విజయవాడలోని శ్రీ శేష సాయి కళ్యాణ వేదికలో నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం నేతన్నలకు ఎంత పెన్షన్ అందిస్తోంది?
నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/ap-smooth-supply-of-urea-in-the-state-minister-atchannaidu/andhra-pradesh/541769/

Breaking News in Telugu Digital Innovation Handloom Latest News in Telugu Minister Savita QR code Rural Weavers telangana government Telugu News Today textile industry Weaver Card

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.