📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Telugu news: Guntur Range IG: గ్రామ స్థాయిలో నేరాల నియంత్రణకు కొత్త దిశా నిర్దేశం

Author Icon By Tejaswini Y
Updated: December 11, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ గుంటూరు రేంజ్ ఐజి(Guntur Range IG) సర్వ శ్రేష్ట త్రిపాఠి, జిల్లా యస్ పి డా. అజిత వేజెండ్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో సైతం సమస్యలను తెలుసుకోవడానికి పోలీసు డిపార్టుమెంటుకు ప్రజలకు మధ్య వారధి సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి లేనని పేర్కొన్నారు. ఆయా పరిధిలో పోలీసులకు సంబంధించిన స్థానిక సమస్యల గురించి, అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు, గంజా సేవించేవారు, అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా, అసాంఘీక కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపాలని సూచించారు.

Read Also:  Vande Bharat Express : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నరసాపురం వరకు వందేభారత్ ఎక్స్ ప్రెస్

సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులకు IG మార్గదర్శకాలు

కాలేజీలు, స్కూలు విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాల గురించి ప్రొఫెసర్స్ కానీ, స్థానిక కౌన్సిలర్స్ ద్వారా కానీ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మిస్సింగ్ కీసులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూన, ఈవ్ టీజింగ్ ప్రత్యేక దృష్టి సారించాలని ఐజి ఆదేశించారు. అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళా చట్టాల పట్ల, శక్తి యాప్, సోషల్ మీడియాలపై, ప్రజలకు సఖి కౌన్సెలింగ్ కేంద్రం, ఓపెన్ డ్రింకింగ్, పోక్సో కేసులు నివారణ చర్యలను వివరించాలని తెలిపారు. మహిళల భద్రతకు చేయాల్సిన కృషి, తీసుకోవాల్సిన చర్యలు గురించి వారికి పిపిటీ ద్వారా దిశానిర్ధేశం చేశారు. మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలతో అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాగా పని చేసి వారిని గుర్తించి ఆయా వివరాలను వారి సర్వీస్ బుక్ నందు నమోదు చేస్తామని, వారి సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

గుంటూరులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలోపేతం

ఈ కాన్ఫరెన్స్ నందు అడిషనల్ యస్.పి. (అడ్మిన్) సిహెచ్. సౌజన్య, రూరల్ డిఎస్పి జి. శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నేరాల నియంత్రణపై టాస్క్ ఫోర్స్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టాలని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి జిల్లాలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలకు ఆయన పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయుటకు ప్రతి బృందానికి ఒక ఎస్సై స్థాయి అధికారి ఇంచార్జ్ ఉంటూ చురుకుగా, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లా పోలీసు వ్యవస్థను మరింత సమయస్పూర్తితో, సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళాలని అయన కోరారు. ప్రతి బృందం నిర్దిష్ట ప్రాంతాల్లో, నిర్దిష్ట నేర రకాలపై ఫోకస్ పెట్టి పనిచేయాలని స్పష్టం చేశారు. నేరాలు జరుగుటకు అవకాశం ఉన్న సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ సడెన్ రైడ్స్ నిర్వహించాలని సూచించారు. రాత్రిపూట పహారా, పాయింట్ చెకింగ్, మొబైల్ పార్టీల గస్తీ గాంజా అమ్మకం, వినియోగం, రవాణాపై జిల్లా వ్యాప్తంగా అత్యంత కఠిన చర్యలు చేపట్టాలని ఐజి ఆదేశించారు వీకెండ్స్, ఫెస్టివల్ డేస్లో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రమాదాలను ముందస్తుగా అరికట్టాలన్నార క్రిమినల్స్ ఉన్న ప్రదేశాలు, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లు పద్ధతి ప్రకారం నిర్వహించాలి. పెంచాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Ajitha Vejendla Guntur Range IG Sarvashreshtha Tripathi village secretariats Women Protection Secretaries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.