Guntur: ప్రముఖ విద్యావేత్త, కాటూరి మెడికల్ కాలేజీ అధినేత కాటూరి సుబ్బారావు గారు తన స్వగ్రామంపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనాల అభివృద్ధి కోసం ఆయన కోటి రూపాయలను విరాళం ప్రకటించారు. గ్రామ పెద్దల సమక్షంలో కాటూరి సుబ్బారావు కోటి రూపాయల నగదును బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేశారు. ఈ నిధులతో పాఠశాలలో అత్యాధునిక వసతులతో కూడిన నూతన భవనాలను నిర్మించడమే కాకుండా, విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ లేదా టెక్నాలజీ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
కేవలం విద్యకే పరిమితం కాకుండా, గ్రామంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కూడా ఈ నిధులతో నిర్మించనున్నారు.ఈ సందర్భంగా కాటూరి సుబ్బారావు కృషిని గ్రామస్థులు, విద్యా శాఖ అధికారులు అభినందించారు. తన సంపాదనలో కొంత భాగాన్ని నిరంతరం సమాజ సేవకు, ముఖ్యంగా ఆరోగ్యం మరియు విద్యా రంగాలకు కేటాయించడం ఆయన ప్రత్యేకత.
Read Also: Sharmila vs Jagan: వైఎస్ షర్మిల, తన అన్న జగన్‌పై తీవ్ర విమర్శలు
Guntur: కాటూరి మెడికల్ కాలేజీ ప్రస్థానం
కాటూరి మెడికల్ కాలేజీని 1997లో ఏర్పాటు చేశారు. గుంటూరుకు 15 కిలోమీటర్ల దూరంలో చిలకలూరిపేట మార్గంలో ఈ కాలేజీ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సుబ్బారావు గారి ప్రతిభ దేశ సరిహద్దులు దాటింది. టాంజానియా తొలి అధ్యక్షుడు జూలియస్ నెయరెరే ఆహ్వానం మేరకు అక్కడ ఇంటర్నేషనల్ మెడికల్ అండ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ని నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌లో కూడా ఆయన కీలక భాగస్వామిగా ఉంటూ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: