📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Guntur: డబ్బు కోసం ముగ్గురి ప్రాణాలు తీసిన ముఠా

Author Icon By Sharanya
Updated: June 24, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వాన్ని మరిచిన ఓ ముఠా, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే ముగ్గురిని చంపిన ఘటన, స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఇటువంటి ఘోరమైన హత్యలు, పక్కా ప్లాన్‌తో జరిగిన విధానం, మానవ సంబంధాల ముసుగులో ఉన్న పాశవికత్వం ఈ సంఘటన ద్వారా బయటపడింది.

మొదటి హత్య – బంగారు ఆభరణాలపై కన్ను

తెనాలి పట్టణంలోని మారీస్ పేట ప్రాంతానికి చెందిన కుసుమ కుమారి తన పరిచయ మహిళ అయిన 70 ఏళ్ల సుభాషిణిపై బంగారు ఆభరణాల కోసం దృష్టిపెట్టింది. సుభాషిణి పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో ఆమె ఒంటరిగా జీవించేది. మే 25వ తేదిని తనకు తెలిసిన ఆటో డ్రైవర్ గోపిక్రిష్ణ ను సుభాషిణి ఇంటికి రమ్మని కుసుమ కుమారి చెప్పింది. గోపిక్రిష్ణ గోడ దూకి సుభాషిణి ఇంటిలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడే ఉన్న కుసుమకుమారి గోపిక్రిష్ణ సాయంతో సుభాషిణిని గొంతు నులిమి చంపేసి ఆమె ఇంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.

హత్యను కప్పిపుచ్చే ప్రయత్నం

సుభాషిణి కుమార్తె తల్లి ఫోన్ తీసుకోకపోవడంతో అనుమానం వచ్చి కుసుమ కుమారిని సంప్రదించింది. దీంతో కుసుమ కుమారి తన ఇంటి పక్కల వారిని తీసుకొని సుభాషిణి ఇంటికి వెళ్లింది. అయితే, ఆమె చనిపోయి ఉండటంతో ఈ విషయాన్ని కుమార్తెకు చెప్పింది. ముఖంపై గాయాలు, ఆభరణాలు మాయం కావడం చూసినప్పటికీ, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆభరణాలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును ముఠా సభ్యులు పంచుకున్నారు.

మరో హత్యకు ప్రయత్నం – కానీ సీసీ కెమెరా అడ్డుపడ్డది

ఈ హత్య బయటకు రాకపోవడంతో మరొక హత్యకు ప్లాన్ వేశారు. సీసీ కెమెరాల కారణంగా మరో ఒంటరి మహిళ హత్యను విరమించుకున్నారు.

రెండవ దారుణం – ఇద్దరి హత్య

రాజేశ్వరి, అంజమ్మలపై కన్నేసింది. వారి ఇంటిపై గది ఖాళీగా ఉండటంతో ఆ గది అద్దెకు తీసుకునే పేరుతో వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని చంపే విధంగా ప్లాన్ వేసింది. ఇందు కోసం ఈ నెల పద్దెనిమిదో తేదిన రాజేశ్వరి ఇంటి వద్దకు వెళ్లారు. అయితే జనసంచారం అధికంగా ఉండటంతో వెనుదిరిగివచ్చారు. మరొసటి రోజు మరొక సారి రాజేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమెపై అంతస్థులోకి వెళ్లి గది చూపించిన తర్వాత గోపిక్రిష్ణ, కుసుమ కుమారి మరొక మైనర్ బాలుడితో కలిసి వారిద్దరి హత్య చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.

సీసీ కెమెరా బలమే కేసు చేధనకు కీలకం

నిందితులు రాజేశ్వరి ఇంటిలో సీసీ కెమెరాలు ఉన్న విషయం గమనించలేదు. సిసి కెమెరాలను వారి కుమార్తె తన ఫోన్ కు అనుసంధానం చేసుకోవడంతో ఎవరూ ముగ్గురు వచ్చి వెళ్లినట్లు వారి కుమార్తె పోలీసులకు చెప్పింది.

పోలీసుల చర్యలు

సిసి కెమెరా విజువల్స్ సాయంతో ముగ్గురి గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సిసి కెమెరా విజువల్స్ లేకుంటే ఎంతోమంది ప్రాణాలను ముఠా హరించేదని స్థానికులు అంటున్నారు. కుసుమకుమారి, గోపిక్రిష్ణలతో పాటు మరొక మైనర్ బాలుడు కూడా ఈ హత్యల్లో పాలు పంచుకోవడం కలకలం రేపింది.

Read also: Pawan Kalyan : తల్లికి అస్వస్థత :కేబినెట్ మీటింగ్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్

#APCrime #CCFootage #GoldGreed #GunturCrime #murder_mystery #PoliceInvestigation #TripleMurder Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.