📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Guntur: గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

Author Icon By Saritha
Updated: January 31, 2026 • 1:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకరు పట్టుదలతో పోరాడి గ్రూప్-1లో విజయం సాధిస్తే, మరొకరు తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2లో శ్రేష్టుడిగా నిలిచారు. గుంటూరు (Guntur) కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రియాంక, సాహితి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై తమ తల్లిదండ్రులకు మర్చిపోలేని కానుకను అందించారు.

Read Also: Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం

ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం

అక్క ప్రియాంకది అసాధారణ విజయం అనే చెప్పాలి.  (Guntur) ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేసి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా, చిన్ననాటి ఐఏఎస్ కల ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. ఉద్యోగాన్ని వదిలి సివిల్స్, గ్రూప్స్ వైపు అడుగులు వేశారు. ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండా, రోజుకు 15 గంటల పాటు శ్రమిస్తూ సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకున్నారు. గతంలో రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమైనా కుంగిపోలేదు. 2024 ప్రిలిమ్స్, 2025 మెయిన్స్ రాసి, చివరకు గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్ హోదాను దక్కించుకున్నారు.

చెల్లి సాహితి లక్ష్యం కూడా ఐఏఎస్ కావడమే. అందుకే పక్కా ప్లానింగ్‌తో డిగ్రీలో బీఏ గ్రూపు తీసుకుని ఢిల్లీలో చదువుకున్నారు. సివిల్స్ ప్రిపరేషన్‌ను గ్రూప్-2కు మళ్లించి, మొదటి ప్రయత్నంలోనే రోడ్లు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ ఉద్యోగంలో చేరుతూనే, ఐఏఎస్ సాధించే వరకు తన పోరాటం ఆపనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి తండ్రి చంద్రుడు వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా రిటైర్ అయ్యారు, తల్లి స్వర్ణలలిత కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. ఇలాంటి కుటుంబ నేపథ్యంతో ఈ అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తా చాటారు. గుంటూరులో అందరూ వీరి విజయాన్ని ప్రశంసిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

government jobs Group-1 Exam Group-2 Exam Latest News in Telugu Priyanka and Sahithi Sibling Success Sisters’ Achievement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.