📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Guntur Crime: ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 9:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు (Guntur) జిల్లాలోని ముప్పాళ్ల మండలంలో ఓ ప్రేమికుల జీవితంలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో, ఒక యువ జంట కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రేమలో గాఢమైన బంధం ఉన్నప్పటికీ, వారు కుటుంబాల ఒప్పందం లేకుండా విడిగా జీవించలేమని భావించారు. ఈ కారణంగా, వారి ప్రేమిక హృదయాలను ముగించడానికి వారు అత్యంత దురదృష్టకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

Drugs: ఆర్జెంటినా లో ముగ్గురు యువతుల దారుణ హత్య

కలిసి జీవించలేమని తెలిసి, మరణంలోనైనా ఒక్కటిగా ఉండాలని భావించిన ఆ ప్రేమికులు.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన గోపి నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఆ కాలేజీలో చదువుతోన్న తెనాలి మండలం అత్తోటకు చెందిన ప్రియాంకతో గోపికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి.. ప్రేమకు దారితీసింది.

గోపి, ప్రియాంక కుటుంబాలకు తెలియడంతో మందలించారు

ఈ విషయం గోపి, ప్రియాంక (Gopi, Priyanka) కుటుంబాలకు తెలియడంతో మందలించారు. అయితే, పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో అందుకు వారు అంగీకరించలేదు. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహ‌లకు గురైన గోపి, ప్రియాంకలు.. ఒకరిని వీడిచి ఒకరు ఉండలేమని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆ ప్రేమ జంట కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Guntur Crime

సోమవారం పేరేచర్ల రైల్వే స్టేషన్ (Peracherla Railway Station) సమీపానికి చేరుకుని, పట్టాలపై అడ్డంగా పడుకున్నారు.. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడు చేరుకున్నారు. ఘటనా స్థలిలో అత్యంత భయానక దృశ్యాలు చూసి వాళ్లు షాకయ్యారు. ఇరువురు తలలు, మొండెం నుంచి వేరుపడి అత్యంత భయంకరమైన స్థితిలో ఉన్నారు.

ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని

తల, మొండెం వెరుపడిప ఆ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కుటుంబాలకు సమాచారం అందజేశారు. విషయం తెలియగానే గోపి, ప్రియాంకల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తాము పెళ్లికి ఒప్పుకోకపోతే ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఈ సంఘటనతో ఇరు గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని ఇలాంటి నిర్ణయం తీసుకుని, కన్నవారికి గుండెకోతను మిగిల్చిన ఈ ప్రేమికుల కథ ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh News Breaking News couple suicide Gopi and Priyanka Guntur love tragedy latest news love story gone wrong railway suicide teen love tragedy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.