📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Guntur Crime: ప్రేమవివాహం చేసుకున్న IAS అధికారి కుమార్తె.. ఆపై ఆత్మహత్య

Author Icon By Pooja
Updated: December 2, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి (27) ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో(Guntur Crime) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్త వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రారంభ దర్యాప్తులో బయటపడుతోంది.

Read Also: Crime : తిరుపతి దగ్గర భయానక దృశ్యం – ముగ్గురు అనుమానాస్పద మృతి

Guntur Crime: IAS officer’s daughter who married for love… then committed suicide

నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని మాధురి ప్రేమించి 2025 మార్చిలో వివాహం చేసుకుంది. కానీ పెళ్లైన కొద్దికాలానికే ఆమె భర్త వేధిస్తున్నాడని మాధురి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో పోలీసులు సహకారంతో మాధురిని రెండు నెలల క్రితం తాడేపల్లిలో ఉన్న పుట్టింటికి తీసుకువచ్చారు. అయితే ఆదివారం రాత్రి మాధురి తన గదిలోని బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు(Guntur Crime) ఘటనాస్థలానికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. మాధురి తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రారంభ సమాచార ప్రకారం, మాధురి గర్భిణీ అయినట్లు, ఇటీవలి రోజులుగా భర్త ప్రవర్తన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైందని తెలుస్తోంది.

చిన్నరాముడు చేసిన ఆరోపణలు

తన కుమార్తెను ప్రేమ పేరుతో మోసం చేశాడని చిన్నరాముడు తీవ్ర ఆరోపణలు చేశారు.

చిన్నరాముడు తెలిపిన వివరాల ప్రకారం, తమ కుమార్తె మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు, రెండు నెలల క్రితం అత్తారింట్లో ఉండలేనని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. “ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. మా కుమార్తె చివరికి రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని ఆకాంక్షతోనే ఉందని” చిన్నరాముడు కన్నీటి పర్యంతమయ్యారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu ias-officer Latest News in Telugu madhuri-sahithibai suicide-case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.