📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: Guntur crime: ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

Author Icon By Pooja
Updated: December 15, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసపోవడం పెరుగుతున్న వేళ, గుంటూరులో(Guntur crime) చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు యువకులు మత్తుపదార్థాలకు అలవాటు చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

Read Also: Sangareddy Crime: నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

A drug trap under the guise of love; the minor’s case causes a stir.

సోషల్‌ మీడియా పరిచయంతో మొదలైన వ్యవహారం

పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు(Guntur crime) చెందిన 17 ఏళ్ల బాలిక స్థానిక కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న సీనియర్‌తో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన ఆ యువకుడు ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు మత్తుపదార్థాల అలవాటు చేసి, తన గదికి పిలిపించి డ్రగ్స్‌(Drugs) ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. మత్తులో ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు కూడా పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ వ్యవహారం బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేయడంతో బయటపడింది. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేస్తున్న తల్లి ఇటీవల కుమార్తె ఫోన్‌ పరిశీలించగా, ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కనిపించాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె కుమార్తెను ప్రశ్నించగా, తల్లిదండ్రులపై దాడి చేసినట్టు సమాచారం. అనంతరం తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఆమెను గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు.

విషయం తెలుసుకున్న ఈగల్‌ విభాగ ఐజీ ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపడతామని ఐజీ తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా మైనర్‌ను డ్రగ్స్‌కు బానిస చేసిన అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, బాలికకు అవసరమైన చికిత్సను ఆడిక్షన్‌ సెంటర్‌ ద్వారా అందిస్తామని చెప్పారు.

నిందితుడు విద్యార్థి సంఘ నాయకుడని అనుమానం

ఎస్పీ ఆదేశాల మేరకు తూర్పు డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ నేతృత్వంలో లాలాపేట సీఐ శివప్రసాద్‌ ప్రత్యేక విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో డ్రగ్స్‌ అలవాటు చేసిన యువకుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం వెల్లడైంది. బాలిక అతడితో ప్రేమలో ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు వేరే వివాహ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబంలో విభేదాలు పెరిగినట్టు పోలీసులు గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

DrugAbuse Google News in Telugu Latest News in Telugu LoveTrap

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.