📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Guntur Chili Market: ప్రజల కంట్లో గుంటూరు ‘కల్తీ’ కారం

Author Icon By Rajitha
Updated: December 2, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు మిర్చి యార్డు: మిరపకాయలు లేకుండానే కారం తయారు చేస్తున్న కేటుగాళ్లు? గుంటూరు మిర్చి యార్డును అడ్డాగా చేసుకొని చుట్టుపక్కల కొంతమంది మిల్లుల యజమానులు, ఏజెంట్లు కేంద్రాలను ఏర్పాటు చేసి కల్తీ కారంను అడ్డగోలుగా సరఫరా చేస్తున్నారు… గుంటూరు (Guntur) మిర్చి మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇంత పెద్దస్థాయిలో గుర్తింపు పొందిన గుంటూరు మార్కెట్ యార్డు చుట్టు పక్కల కొన్ని మిల్లులను ఏర్పాటు చేసి నాణ్యమైన కారం అంటూ ప్రజలు గుర్తించలేని విధంగా కొంతమంది కారం విక్రయ ఏజెంట్లు మిల్లుల యజమానులు కలిసి కల్తీ కారాన్ని తయారుచేసి వారి కళ్ళల్లో కొడుతున్నారు. వాస్తవానికి మంచి నాణ్యమైన మిరపకాయలను కొనుగోలు చేసి కారం తయారు చేసుకునేందుకు ప్రతి ఇంట్లో గృహిణిలు ఇష్టపడతారు. అయితే గుంటూరు కేంద్రంగా ఇక్కడ తయారుచేస్తున్న కల్తీ కారంలో అసలు మిరపకాయలే లేకుండా తయారు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురికాక తప్పని పరిస్థితి దాపురించింది.

Read also: AP Weather: ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Guntur Chili Market

ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని

మిరపకాయల నుంచి తీసి పడేసిన కేవలం తొడి మెలతో కారం తయారు చేయడం ఒక పద్దతైతే, గర్భాలు పోయిన కాయలను, ఫంగస్ వచ్చి చెడిపోయిన కాయలతో పూర్తిగా పాడై పోయిన తాలుకాయలు సేకరించి కల్తీ కారం తయారు చేసి మార్కెటింగ్ చేయటంలో సిద్ధహస్తులుగా మారారు. ఇలా తయారుచేసిన పొడిలో పామాయిల్ని మిక్స్ చేసి, రంగులు కలిపి నాణ్యమైన కారంగా తక్కువ ధరకే అమ్ముతున్నాం అంటూ మార్కెటింగ్ వ్యాపారం చేసే కల్తీ కేటుగాళ్లు కోట్ల సంపాదనకు పడగలెత్తారు. ఇటువంటి కారాన్ని ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారంటే ఈ కల్తీకారం వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కల్తీ కారం అని తెలియక తినటం వల్ల అనేకమంది పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అనారోగ్యాలకు గురవుతున్నారు.

కల్తీల వల్ల అనారోగ్యాలకు

దీనివల్ల అనారోగ్యాలకు గురై ఆసుపత్రిచుట్టూ తిరుగుతూ తమ జేబులకు చిల్లులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఎందువల్ల ఇటువంటి కొత్త రోగాలు వస్తున్నాయి అని గుర్తించలేని స్థితిలో వైద్య అధికారులు అప్పటికప్పుడు వాళ్లకు తోచిన వైద్యం అందించటం జరుగుతుంది. ప్రజలు ప్రాణభయంతో వైద్యులు అడిగినంత కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. చివరకు ఇటువంటి కల్తీల వల్ల అనారోగ్యాలకుగురవుతున్నామని అనేకమంది గుర్తించలేకపోవడం హాస్యాస్పదం. ఈ కల్తీ కారం గుట్టు గమనించి అనేకమంది నివ్వెర పోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కేంద్రంగా జరుగుతున్న ఈ కల్తీ కారం దందా, యదేచ్చగా జరుగుతున్నా ప్రభుత్వ అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రంగు కలిపిన కల్తీ కారం

భారీ స్థాయిలో రంగులు కలిపిన కల్తీ కారం వ్యాపారం జరుగుతున్న ఎటువంటి దాడులు జరగకపోవడమే ఇందుకు నిదర్శనం అనే అనుమానాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నాయకుల పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడం వల్లే అధికారులకు తెలిసి కూడా ఇదంతా జరుగుతుందా అని కూడా అనేకమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల జేబులు నింపటం వల్లే రంగు కలిపిన కల్తీ కారం తయారుచేసే ఏజెంట్లు, మిల్లుల యజమానుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని స్థానికంగా గుంటూరు మిర్చి యార్డులో, ఆ చుట్టు పరిసర ప్రాంతాలకు చెందిన అనేకమంది వ్యాపారులు ప్రజల మధ్య చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇంత ఘోరం జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్లు, విజిలెన్స్ విభాగం అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Adulteration Chili Powder Fake Spices Guntur latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.