📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

Guntur: ప్రాణాల మీదకు స్నేహితుల సరదా..పెన్ను మింగిన వైనం

Author Icon By Saritha
Updated: January 1, 2026 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.50 పందెం కోసం ఓ విద్యార్థి (student) చేసిన పని అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పెన్ను మింగేయగా అది మూడేళ్లపాటు కడుపులోనే ఉండిపోయింది. తాజాగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో గుంటూరు (Guntur) ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్‌) వైద్యులు అత్యాధునిక విధానంలో పెన్నును వెలికితీసి ప్రాణాపాయం తప్పించారు. 

Read also: District Reorganization: అతిపెద్ద జిల్లాగా కడప అగ్రస్థానం 

అస‌లేం విషయం ఏమిటంటే..!

గుంటూరులోని కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాత దంపతుల కుమారుడు మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. (Guntur) మూడేళ్ల క్రితం అంటే తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో స్నేహితులతో సరదాగా రూ.50 పందెం కాసి ఓ పెన్నును మింగేశాడు. అప్పట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు చెబితే తిడతారన్న భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టాడు.

అయితే గత ఏడాది కాలంగా అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తున్నా మందులతో సరిపెట్టుకున్నాడు. కానీ, డిసెంబరు 18న నొప్పి భరించలేనంతగా మారడంతో స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు మురళీకృష్ణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్‌ తీయగా పెద్దపేగులో పెన్ను ఇరుక్కున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఎలాంటి కోత లేకుండా ‘రెట్రో గ్రేడ్‌ ఎంటెరోస్కోపీ విత్‌ ఓవర్‌ ట్యూబ్‌’ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగించి పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. మూడేళ్ల పాటు కడుపులో ఉన్న పెన్ను బయటకు రావడంతో విద్యార్థి కోలుకుంటున్నాడు. క్లిష్టమైన ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



GGH Guntur Guntur news Inter Student Kothapeta Guntur Latest News in Telugu Medical Miracle Student Accident Swallowed Pen Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.