📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Gunturu: ఏపీ లోని ఆ జిల్లాలో బైపాస్ వెళ్లే పట్టణాలకు మహర్దశ..

Author Icon By Rajitha
Updated: November 23, 2025 • 2:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు (Guntur) జిల్లాలోని దాచేపల్లి మాచర్ల జాతీయ రహదారి 167AD వెంబడి ఉన్న గురజాల, మాచర్ల, రెంటచింతల పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ఇచ్చింది. ఈ పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్లు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు NHAI రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవగా, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

Read also: Nara lokesh: పుట్టపర్తిలో 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్‌

A great opportunity for the towns .

Gunturu: కొత్తగా నిర్మించిన బైపాస్ మార్గాలతోపాటు, పట్టణాల మధ్య ప్రధాన రహదారులను మరింత విస్తరించనున్నారు. రోడ్లకు ఇరువైపులా డ్రెయిన్లు, సైడ్ పాత్‌లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం మెరుగుపడనుంది. తొమ్మిది నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్ణయించారు.

ఏ పట్టణంలో ఏమేం పనులు?

మాచర్ల
సుమారు 4.9 కిమీ రోడ్డును ఇరువైపులా 10 అడుగుల మేర విస్తరించనున్నారు. రహదారికి రెండు వైపులా కొత్త డ్రెయిన్లు కూడా నిర్మించబడతాయి.

రెంటచింతల
4 కిమీ ప్రధాన మార్గాన్ని 15 అడుగుల మేర విస్తరిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో సుమారు 500 మీటర్ల డ్రెయిన్ నిర్మాణం ఉంటుంది.

గురజాల
ప్రస్తుతం ఉన్న 4-లైన్ రోడ్డు 4.2 కిమీల మేర మరింత విస్తరించబడుతుంది. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు కొత్త డ్రెయిన్లు, సైడ్ విస్తరణ చేపడతారు. ఈ పనులు పూర్తవడంతో బైపాస్ మార్గాలు, పట్టణ కేంద్రాలు మరింత సులువు రవాణా సదుపాయాలతో మారబోతున్నాయి. స్థానికులకు, వాహనదారులకు, వాణిజ్య రవాణాకు పెద్దగానే లాభం చేకూరనుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Bypass Road Development Guntur latest news NHAI Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.