📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu news: Guntur: యథేచ్ఛగా కారం కల్తీ 200 మిల్లుల్లో తయారీ

Author Icon By Tejaswini Y
Updated: December 8, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Guntur chilli adulteration: గుంటూరు మిర్చియార్డు: కల్తీకారం తయారీదారులు గుంటూరు బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారు. కల్తీకారానికి కేరాఫ్ గుంటూరు(Guntur) మారడం దురదృష్టకరం. మిర్చి యార్డు పరిసరాల్లో నిత్యము 200 మిల్లుల్లో కల్తీకారం తయారవుతున్న నిధువర్గాలు నిద్రపోవడం వెనుక మామూళ్ల బాగోతం నడుస్తున్నట్లు వినికిడి. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు నిత్యము వేలాది టిక్కీలు, సీజన్లో అయితే లక్షల్లో యార్డుకు దిగుమతి అవుతుంటాయి. అయితే నాణ్యమైన సరుకును వ్యాపారులు కొనుగోలు చేసిన తర్వాత మిగిలిపోయిన తొడిమెలు తాలూకాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి హానికరమైన రంగులను కలిపి కల్తీకారం తయారు చేస్తున్నారు.

Read Also: AP: అర్బన్ ప్రాంతాల సదుపాయాలతో 359 రూర్బన్ పంచాయతీలు!

కల్తీకారానికి కేరాఫ్‌గా మారుతున్న గుంటూరు

ఈ కల్తీకారాన్ని అనేక బ్రాండ్లు పేరు పెట్టి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కల్తీకారం గుంటూరు(Guntur) తో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు రవాణా అవుతుంది. కోట్ల రూపాయల కల్తీకారం లావాదేవీలు జరుగుతున్న విజిలెన్స్, ఆహార నియంత్రణ శాఖ, రెవెన్యూ శాఖ తదితర నిఘా వర్గాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వెనుక అమ్యాలు నడుస్తున్నట్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. వినియోగదారులు ప్రజల ఆరోగ్యముతో చెలగాటమాడుతున్న కల్తీకారం నిర్వాకం పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. యార్డు పరిసరాల్లో నిత్యం 150 నుంచి 200 మిల్లులలో కల్తీకారం వ్యాపారం జరుగుతుందని ఈ వ్యాపారంలో ఆరు తేరిన ఒక వ్యాపారి మరొకరితో చర్చించటం విశేషం.

200 mills manufacturing adulterated chilies

రోజుకు వందల మిల్లుల్లో కల్తీ కారం తయారీ

మేమంతా అధికారులకు నెలవారి మామూళ్ళు సమర్పించుకుంటాం.. మమ్మల్ని ఎవరు ఆపేది అంటూ ధీమా వ్యక్తం చేయడం వెనుక ఏ స్థాయిలో కల్తీకారం వ్యాపారం జరుగుతుందో ఊహించవచ్చు, కల్తీకారం మిల్లుల వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా మాఫియా నడుపుతున్న కల్తీకారం(Chilli powder) మిల్లుల వ్యవహారంపై ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కల్తీకారం అడ్డగా గుంటూరులో 95శాతం కల్తీకారం జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ విభాగం, విజిలెన్స్ నెల వారి మావుళ్ళతో కల్తీ కారాన్ని అరికట్టలేకపోతున్నారు. తడిచిన మిరపకాయలు, తాలు మిరపకాయలు, ఫంగస్ కాయలు మిర్చి యార్డుకు కర్నూలు, గద్వాల్ నుంచి కొత్త మిరపకాయలు వస్తున్నాయి. వీటిని కొత్త కారం అని, ( గర్భాలు పోయిన) మిరపకాయలు, చెడిపోయిన తొడిములు, వరిపొట్టు మిక్సింగ్ చేసి కారం ఆడిస్తున్నారు. ప్రతి కారం మిల్లు యజమానులు ఏజెంట్లు మిల్లులకు తాళాలు వేసి కల్తీకారం అక్రమంగా తయారు చేస్తున్నారు.

తాలి మిరపకాయలతో ‘కారం’ ఆడే దందా

మిల్లులో ఉన్న గుమస్తాలు హమాలీలు మా యజమాని ఎవరు వచ్చినా తాళం తీయవద్దు అని చెబుతున్నారు. తాలు మిరపకాయలు కారం ఆడిస్తున్నాము అని బహిరంగంగానే పేర్కొంటున్నారు. కొందరు యజమానులపై 2016-17లో కల్తీ కారానికి పాల్పడ్డ యజమానులపై కేసులు నమోదు చేశారు, గుంటూరు, ఖమ్మం, ఎమ్మిగనూరు ప్రాంతాలలో కేసులు నమోదు చేశారు. డబ్బుతో అవినీతిని కేసులను మాఫీ చేసుకుంటున్నారు. ఒక యజమాని తినడానికి తిండి లేక వేరే ప్రాంతం నుంచి గుంటూరు నగరానికి వలస వచ్చి ఇక్కడ వెహికల్స్ రిపేర్, మోటారు సైకిల్ కు గాలి పెట్టడం, పంచర్లు వేయడం స్టేజి నుంచి కల్తీ కారం కుంభకోణంలో భాగమై ఈరోజు కల్తీకారం అగ్రస్థానంలో ఉన్నాడు. మరికొందరు వేరే వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి వంట మనిషిగా క్లీనింగ్ గా వచ్చి కల్తీకారం కుంభకోణంలో పాత్రులై తమ వంతు వచ్చిన ఆదాయాన్ని ఆస్తులు రూపంలో పన్నులు కట్టకుండా భారీగా ఆస్తులు చేకూర్చుకున్నారు. ఇది ఐటీరంగ విభాగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగి (డాక్టర్)గా ఉండి కొందరు కారం మిల్లులను లీజుగా తీసుకొని కల్తీ కారం వ్యాపారం నిర్వహిస్తున్నారు. కానీ అధికారులు ఈ కల్తీకారాన్ని నియంత్రించలేకపోతున్నారు. కనీసం రాష్ట్రస్థాయి ఫుడ్ కార్పొరేషన్ అధికారులు దీనిపై దృష్టి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజప్తి చేస్తున్నారు. 2015 2016 ఒక కేజీ రంపం పొడిని మూడు రూపాయలకు కొని దానిని కల్తీ కారంలో వాడి కేజీ 200కి విక్రయించిన బడా బాబులు, గతంలో కల్తీకారానికి పాల్పడ్డ కొందరు ఇప్పుడు విచ్చలవిడిగా కల్తీకారం తయారుకు పాల్పడుతున్నారు.

జిల్లా అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల ఆగ్రహం

అధికార యంత్రాంగానికి నెల మామూలు అవసరమైనంత కోట్లల్లో ఇవ్వడానికైనా సిద్ధం అంటున్న కల్తీ కారం కేటుగాళ్లు 2016 -2017 నుంచి ఇప్పటివరకు, విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ విభాగం వారు ఇంత దారుణంగా కల్తీకారం జరుగుతున్న చూసిచూన్నట్టు పోతున్నారు. కల్తీ కాలం వల్ల క్యాన్సర్ పేగు వూత అరుదుగా వస్తున్నాయని వైద్య నిపుణులు. చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగంకల్తీ కారం పై వారు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రజల వాపోతున్నారు. కల్తీ కారం మిల్లులయజమానుల పై ఐటి దాడులు తక్షణమే జరిపించాలని మరి కొందరు అభిప్ర్నాయ పడుతున్నారు. ఇంత దారుణం చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి..

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

adulterated chilli powder racket chilli powder mafia fake chilli powder Guntur chilli adulteration guntur mirchi yard

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.