Guntakal TDP Leader Attack: గుంతకల్లులో టీడీపీ నేత దౌర్జన్యం.. సోలార్ ఉద్యోగిపై దాడి

Read Time:  1 min
Guntakal TDP Leader Attack: గుంతకల్లులో టీడీపీ నేత దౌర్జన్యం.. సోలార్ ఉద్యోగిపై దాడి
FONT SIZE
GET APP

Guntakal TDP Leader Attack: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. గుత్తి మండలం బేతాపల్లిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో అడ్డుచెప్పిన ఒక సోలార్ కంపెనీ ఉద్యోగిపై టీడీపీ నాయకుడు రవితేజ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also: Pension : పెన్షన్ల తొలగింపు పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ

Guntakal TDP Leader Attack: TDP leader's atrocities in Guntakal.. Attack on solar employee
Guntakal TDP Leader Attack: TDP leader’s atrocities in Guntakal.. Attack on solar employee

రూ. 24,000 ఇస్తేనే ఇసుక.. నిరాకరించినందుకు బెదిరింపులు

వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ నేత రవితేజ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ, ఆ ఇసుకను కొనుగోలు చేయాలని స్థానిక సోలార్ కంపెనీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఒక్కో టిప్పర్ ఇసుకను ఏకంగా రూ. 24,000కు కొనుగోలు చేయాలని హుకుం జారీ చేశారు. అయితే, ఇంత భారీ మొత్తానికి ఇసుకను కొనేందుకు సదరు సోలార్ ఉద్యోగి నిరాకరించడంతో, ఆగ్రహం చెందిన రవితేజ, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.