📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Guntakal Railway: 18న గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక మండలిఎన్నికలు

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంతకల్లు రైల్వే : రైల్వేలో నిత్యం రేయింబవళ్లు చెమటోడ్చి కష్టపడి పనిచేసే శ్రామికులకు కాలక్షేపం నిమిత్తం, మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఆహ్లాదభరిత వాతావరణాన్ని కల్పించడం కోసం నాటి ఆంగ్లేయులు రైల్వేలో అధికారుల కోసం ఆఫీసర్స్ క్లబ్లు, సిబ్బంది కోసం రైల్వే ఇన్స్ స్టిట్యూట్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు సభ్యుల నుంచి సభ్యత్వ రుసుము, రైల్వే నుంచి స్టాఫ్ బెనిఫిట్ ఫండ్లు (Staff Benefit Funds) ఆయా ఇన్స్ స్టిట్యూట్లకు మంజూరు చేస్తారు. లలిత కళల ప్రోత్సాహకానికి కళాపోషణలకు అధిక ప్రాధాన్యతనిచ్చే రాయలసీమ, సీడెడ్ ఏరియాలో రైల్వే లలితకళల ప్రోత్సాహ వేదిక అయిన గుంతకల్లు రైల్వే ఇన్స్ స్టిట్యూట్కు రానున్న రెండేళ్ల కాలవ్యవధికిగాను కొత్త పాలక మండలిని,ఎన్నుకునేందుకు రైల్వే శాఖ ఈ నెల 18న సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు చేపట్టిన ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది.

ప్రతి రైల్వే కార్మికులకి తెలిసిన విషయమే

దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజనల్ కేంద్రంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో ఒకానొక సమయంలో 8వేల పైచిలుకు సభ్యులు ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 943కు పడిపోయింది. వీటికి ప్రధాన కారణమేంటో రైల్వేలో సర్వీసు చేసి పదవి విరమణ చేసిన ఎనభయ్యో దశకంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అయిన ప్రతి రైల్వే కార్మికులకి (railway workers) తెలిసిన విషయమే. 1990వ దశకం వరకు లలిత కళల పట్ల ఆసక్తి, అభిరుచి గల ఔత్సాహికులు, సాహితీ బంధువులు, కళాకారులు, క్రీడాకారులు మొత్తానికి లలిత కళల పట్ల ఆసక్తి, అభిరుచి గల ఔత్సాహిక అభిమానులు మాత్రమే ఇన్ టిట్యూట్ పాలక ఉనికిని మండలికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేవారు.

Guntakal Railway: 18న గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక మండలిఎన్నికలు

క్రీడల పోటీలు నిర్వహించే విధానానికి

కాలక్రమేనా రైల్వే ఇన్స్ స్టిట్యూట్ పాలక మండలిలకు జరిగే ఎన్నికలలో రైల్వేలోనూ కార్మిక సంఘాలు తమ తమ ప్యానెల్స్ను పోటీకై నిలపడం ఆరంభమైంది. ఏటా సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక క్రీడల పోటీలు నిర్వహించే విధానానికి స్వస్తిపలికి, జయాపజయాలతో తమ పరిరక్షించుకునేందుకు ఒక చక్కని అవకాశంగా కార్మిక సంఘాలు (Labor unions) భావించి తమ తమ ప్యానెల్స్ ను నిలపడం ప్రారంభించాయి. నాటి నుండి రైల్వే ఇన్స్ స్టిట్యూట్లు అంటే కేవలం వివాహాది శుభకార్యాలకు అద్దెకు ఇచ్చే ఫంక్షన్ హాల్స్ గా తయారయ్యాయి. వీటిని నిర్వహించుకునేందుకు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.

గుంతకల్లు రైల్వే స్టేషన్ చరిత్ర ఏమిటి?

1888 నుండి 1890 వరకు దక్షిణ మహారత్న రైల్వే (Southern Mahratta Railway) సంస్థ విజయవాడ నుంచి మర్మగోవా వరకు మీటర్-గేజ్ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేసింది, ఇది గుంతకల్లు గుండా సాగింది.1892–93లో గుంతకల్లు–బెంగళూరు రైల్వే మార్గం ప్రారంభించబడింది.1893లో, మీటర్-గేజ్ గుంతకల్లు–మైసూర్ ఫ్రాంటియర్ రైల్వే ప్రారంభించబడింది.ఈ మార్గాలన్నింటినీ దక్షిణ మహారత్న రైల్వే నిర్వహించేది.గుంతకల్లు రైల్వే స్టేషన్ రాయలసీమ ప్రాంతానికి ప్రధాన రైల్వే కేంద్రమైంది. ప్రస్తుతానికి ఇది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలోని ఒక ప్రముఖ జంక్షన్ గా పని చేస్తోంది.

భారతదేశంలో అతి పురాతన రైల్వే స్టేషన్ ఏది?

భారతదేశంలో అతి పురాతన రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), ముంబయి. ఇది మొదట విక్టోరియా టెర్మినస్ అనే పేరుతో పిలువబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Kandula Durgesh: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

Breaking News Cultural Promotion Guntakal Railway Indian Railways latest news Officers Club Railway Institute Railway Staff Welfare Rayalaseema Staff Benefit Funds

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.