విజయవాడ GST : ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 21 శాతం వృద్ధి సాధించింది. దేశ సగటు వృద్ధి (10) కంటే రెట్టింపు స్థాయిలో ఇది నమోదవడం విశేషం. 2024 ఆగస్టులో రాష్ట్రానికి (August) రూ.3,298 కోట్లు రాగా, 2025 ఆగస్టులో రూ.3,989 కోట్ల రాబడి లభించింది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధిక రాబడి సాధించిన నెలగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే (సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అండమాన్ కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా) ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2023 ఆగస్టుతో పోల్చితే ఈసారి నికర జీఎస్టీ వసూళ్లలో 14.38 వృద్ధి, స్థూల జీఎస్టీ వసూళ్లలో 14.67 వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎసీఎస్టీ వసూళ్లు కూడా రెండంకెల వృద్ధిని సాధించాయి. 2024 ఆగస్టుతో పోల్చితే 13.82 అధికంగా వసూలయ్యాయి. 2025 ఆగస్టులో ఐజీఎస్టీ సెటిల్మెంట్ ద్వారా రాష్ట్రానికి రూ.1,613 కోట్లు వచ్చాయి. ఇది 2024 ఇదే నెల కంటే 3.76, 2023 8.93 అధికం. ఇక 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రానికి 5. 21,164 5 – 20255 కాలంలో రూ.22,352 కోట్లు లభించాయి.
ఏపీ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో, ఆర్థిక వ్యవస్థ బలోపేతం!
వృత్తిపన్ను, ఇంధన రంగంలో భారీగా పెరిగింది. జీఎస్టీతో పాటు వృత్తిపన్ను, ఇంధన రంగంలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఇంధన రంగంలో 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 9.07 పెరుగుదల చోటుచేసుకుని రూ.1,389 కోట్లు లభించాయి. వృత్తిపన్ను వసూళ్లలో అయితే అసాధారణ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 52.81 ఆగస్టుతో పోల్చితే 2025 ఆగస్టులో 42.3 అధికంగా వసూలైంది. పెరుగుదల సాధించగా, 2024
2017 నుంచి ఏటా ఆగస్టులో వస్తు సేవల పన్ను వసూళ్ల తీరును గమనిస్తే
2017లో స్థూల జీఎస్టీ రూ.1,899 కోట్లు, నికర జీఎస్టీ రూ.1,050 కోట్లు.
2018లో స్థూల జీఎస్టీ రూ.1,891 కోట్లు, నికర జీఎస్టీ రూ.1,368 కోట్లు.
2019లో స్థూల జీఎస్టీ రూ.2,115 కోట్లు, నికర జీఎస్టీ రూ.1,481 కోట్లు.
2020లో స్థూల జీఎస్టీ రూ.1,955 కోట్లు, నికర జీఎస్టీ రూ.1,503 కోట్లు.
2021లో స్థూల జీఎస్టీ రూ.2,591 కోట్లు, నికర జీఎస్టీ రూ.1,797 కోట్లు.
20225 ລ້ 5.3,170 , నికర జీఎస్టీ రూ.2,277 కోట్లు.
2023లో స్థూల జీఎస్టీ రూ.3,479 కోట్లు, నికర జీఎస్టీ రూ.2,603 కోట్లు.
ລໍ 5.3,298 , 20245 నికర జీఎస్టీ రూ.2,616 కోట్లు.
2025లో స్థూల జీఎస్టీ రూ.3,989 కోట్లు, నికర జీఎస్టీ రూ.2,977 కోట్లు.
మొత్తంగా చూస్తే, 2017 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను వసూళ్లు నిరంతర వృద్ధి దిశగా సాగాయి.
మధ్యలో కొన్ని సంవత్సరాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినా, 2025లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. జీఎస్టీతో పాటు వృత్తి పన్ను, ఇంధన రంగం కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.
2025 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు ఎంత పెరిగాయి?
2025 ఆగస్టులో రాష్ట్రం రూ.3,989 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు సాధించింది. ఇది 2024 ఆగస్టుతో పోలిస్తే 21% వృద్ధి. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక రాబడి.
జీఎస్టీతో పాటు ఏ రంగాల్లో అధిక వృద్ధి నమోదైంది?
జీఎస్టీతో పాటు వృత్తిపన్ను మరియు ఇంధన రంగంలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. వృత్తిపన్ను వసూళ్లు 52.81% పెరిగాయి, ఇంధన రంగం 9.07% వృద్ధి సాధించింది. ఈ రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడ్డాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :