Green house gas : సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

Read Time:  1 min
Green house gas
Green house gas
FONT SIZE
GET APP

గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పు లకు అనుగుణంగా ఉండటానికి ప్రతి దేశం స్వీయ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరు గుదలను రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేయాలి. పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే1.5 డిగ్రీల సెల్సియస్ వైపు ప్రయత్నాల ను కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకు న్నాయి. గ్రీన్ హౌస్ (Green house gas)వాయు ఉద్గారాల ను ఒక దేశం ఎలా తగ్గించాలో ఆ దేశం జాతీయంగా నిర్ణయించుకున్న సహకారాల (నేషనల్లీ డిటెర్మైన్డ్ కాంట్రిబ్యూ షన్స్ ఎన్ఎసి) తో తెలుస్తుంది. 2035 వరకు ఉద్దేశించిన వాతావరణ చర్యలను ఇవి వివరిస్తాయి. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రతి దేశం తమ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసు కుని ప్రతి ఐదుసంవత్సరాలకు ఒకసారి జాతీయంగా నిర్ణ యించుకున్న సహకారాలను మరింత ఎక్కువ ఆశయంతో నవీకరించాలి. ప్రజలకు సురక్షితమైన భవిష్యత్తును నిర్ధా రించడానికి దేశాలు మరింత ప్రతిష్టాత్మకమైన జాతీయంగా నిర్ణయించుకున్న సహకారాలను అందించడం చాలా కీలకం. అన్నిదేశాలు జాతీయంగా నిర్ణయించిన సహకారాలను, వాతా వరణ కార్యాచరణ ప్రతిజ్ఞలను ఐక్యరాజ్యసమితికి అందిం చాయి. భారతదేశం అక్టోబర్ 2016లో పారిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. అభివృద్ధి ప్రాధాన్యతలను, పెరుగుతున్న ఇంధన డిమాండ్ను సమతుల్యం చేస్తూ ప్రతిష్టాత్మక వాతా వరణ లక్ష్యాలను పెట్టుకుంది. భారతదేశానికి మూడు ప్రధాన పరిమాణాత్మక లక్ష్యాలు ఉన్నాయి. అటవీ విస్తీరణతో 2.53 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలకు సమానమైన అదనపు కార్బన్ సింక్ను సృష్టించాలి. కార్బన్ సింక్ అంటే వాతావర ణం నుండి విడుదలయ్యే దానికంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని, నిల్వచేసే సహజమైన లేదా కృత్రిమ మైనవ్యవస్థ. ఉద్గార తీవ్రతను 33.35శాతానికి తగ్గించాలి. శిలాజేతర ఇంధన వనరుల నుండి సంచిత విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యంలో దాదాపు 40 శాతం సాధించాలి. విద్యుత్, రవాణా, పరిశ్రమ, వ్యవసాయం, భూవినియోగం, వ్యర్థ రంగాలలో ఉపశమన ప్రయత్నాలను ఈలక్ష్యాలు సూచిస్తా యి.

Read Also : PIL: ఎన్నికల ముందు ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Green house gas
Green house gas

విద్యుత్ శక్తి

స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నవంబర్ 2021లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ పార్టీల ముఖ్యమైన వార్షిక వాతావరణ శిఖరాగ్ర సమావేశం (సిఓపి) 26వ సదస్సు లక్ష్యాలను బలోపేతం చేసి లక్ష్యాలను నవీకరించింది. 2005 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి దాని ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించాలి. 2030 నాటికి శిలాజతర ఇంధన ఆధారిత ఇంధన వనరుల నుండి దాదాపు 50శాతం సంచిత విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలి. 2070 నాటికి గ్రీన్ హౌస్ (Green house gas)ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలని దీర్ఘకాలిక లక్ష్యాన్ని భారతదేశం పెట్టు కుంది. భారతదేశం తన వాతావరణ ప్రతిజ్ఞలవైపు గణనీయమైన పురోగతిని సాధించింది. నిర్ణీత కాలసమయం కంటే ముందే అనేక కీలక మైలురాళ్లు సాధిస్తోంది. ప్రస్తుత విధానాల ప్రకారం 2030 నాటికి ఇంధన రంగ ఉద్గారాల తీవ్రతలో 48.57 శాతం తగ్గింపు సాధ్యమని పలు స్వతంత్ర సంస్థలు అంచనా వేస్తున్నాయి. భారత అటవీ సర్వేక్షణఅంచ నాల ప్రకారం భారతదేశం మొత్తం అటవీ కార్బన్ నిల్వలు 2005లో సుమారు 28.14 బిలియన్ టన్నులుగా ఉంది. 2023లో సుమారు 30.43 బిలియన్ టన్నులకు పెరిగాయి. ఈ అంచనాల ప్రకారం ఇది 2030నాటికి సుమారు 31.71 బిలియన్ టన్నులకు పెరగొచ్చు. తద్వారా అదనంగా 2.53 బిలియన్ టన్నుల సింక్ను సృష్టించాలనే జాతీయంగా నిర్ణ యించుకున్న సహకారాల లక్ష్యానికి చేరువవుతుంది. అత్యంత ప్రముఖ విజయాలలో ఒకటి శిలాజయేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం విస్తరణ. భారతదేశం తన 2030 లక్ష్యానికి ఐదేళ్ల ముందే మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం సౌర, పవన, జల, అణుశక్తి వంటి శిలాజయేతర ఇంధన వనరుల నుండి
పొందే మైలురాయిని చేరుకుంది. 2025 మధ్యనాటికి, భారతదేశం మొత్తంస్థాపిత విద్యుత్ సామర్థ్యం 500 గిగావాట్లు దాటింది. పునరుత్పాదక -ఇంధనమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇందులో 256 గిగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం శిలాజయేతర ఇంధన వనరుల నుండి వస్తుంది. ఇది స్వచ్ఛమైన విద్యుత్వపు గణనీయమైన మార్పును ప్రతిబింబి స్తుంది. భారతదేశ పరివర్తనలో విధాన పరమైన మద్దతు, వ్యయతగ్గింపులు, ప్రైవేట్ రంగ భాగస్వా మ్యంతో సౌర, పవన విద్యుత్ కీలకంగా మారాయి.

అనేక సవాళ్లు

భారత దేశం వేగవంతమైన సౌరశక్తి విస్తరణ ప్రపంచంలోని ప్రముఖ సౌర విద్యుత్, ఉత్పత్తిదారుల సరసన నిలబెట్టింది. ఇంధన, పారిశ్రామిక రంగాలలో కొనసాగుతున్న విధానపరమైన ప్రయత్నాలు, నిర్మాణాత్మక పరివర్తనలు 2030 నాటికి 45 శాతం తగ్గింపు అనే సవరించిన లక్ష్యాన్ని అధిగమించేదిశగా భారతదేశాన్ని నడిపిస్తున్నాయి. ప్రశంసనీయమైన పురోగతి ఉన్నప్పటికీ భారతదేశం జాతీయంగా నిర్ణయించుకున్న సహకారాల ఆశయాలు, విస్తృత వాతావరణ లక్ష్యాలను పూర్తిగా సాకారం చేసుకోవడంలో సవాళ్లు మిగిలి ఉన్నాయి. స్థాపిత పునరుత్పాదక సామర్థ్యం పెరిగినప్పటికీ, ఇప్పటికీ గ్రిడిమిశ్ర మంలో బొగ్గు ఆధిపత్యం కంటే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వెనుకబడి ఉంది. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు ప్రధాన సహకారిగా కొనసాగుతోంది. వేగంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడానికి విస్తరిస్తోంది. ఇది స్థిరమైన వృద్ధిని ఇంధన భద్రతతో సమతుల్యం చేయడంలో సంక్లిష్త ను సూచిస్తోంది. మరొక సవాలు వాతావరణ నిబద్ధతలను సకాలంలో సమర్పించడం. 2025లో 2030 తర్వాత కాలానికి నవీకరించిన ఎన్ఎసిని సమర్పించడానికి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన గడువును భారతదేశం కోల్పోయింది. స్వచ్ఛమైన విద్యుత్, ఇంధన సామర్థ్యం, అనుసరణ చర్యల కోసం తగినంత పెట్టుబడిని, ముఖ్యంగా ప్రైవేట్రంగ ఆర్థికసహాయాన్ని సమీకరించడం చాలా కీలకం. భారతదేశం ప్రస్తుతం అంగీకరించిన 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాన్ని చేరుకోవడానికి బలమైన పునరుత్పాదక ఇంధన విస్తరణ, ఉద్గార సామర్థ్య మెరుగుదలలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రిడ్ నిల్వ వంటి రంగాల లో లోతైన కర్బన ఉ ధారరహిత వ్యూహాలు, ఆవిష్కరణల ను గణనీయంగా పెంచాలి. స్థితిస్థాపక మౌలిక సదుపాయా లు, వాతావరణ స్మార్ట్ వ్యవసాయం, విపత్తు నిర్వహణ చట్రాలలో పెట్టుబడులను ఆకర్షించాలి. 2070 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విధాన సమన్వయాన్ని బలోపేతం చేయాలి. స్థిరమైన సాంకేతికతలను ప్రోత్సహించాలి. గ్రీన్ ఫైనాన్స్ విధానాలను విస్తరించాలి. అంతర్జాతీయ సౌర కూటమి వంటి చొరవలతోసహా అంతర్జాతీయ వాతావరణ దౌత్యం, భాగస్వా మ్యాలలో భారతదేశం నిరంతర భాగస్వామ్య వాతావరణ చర్యను ఉత్ప్రేరకపరిచే దానిసామర్థ్యాన్ని పెంచుకోవాలి.
-డా. సునీల్ కుమార్ పోతన

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.