📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Amaravati: తొలి ఐబిఎం క్వాంటం కంప్యూటర్ కు గ్రీన్ సిగ్నల్

Author Icon By Digital
Updated: September 2, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీచేసింది.

అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) ఏర్పాటు చేసింది వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు ఉండనున్నాయి.

2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్యాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఐబీఎం(IBM) సంస్థ. భద్రమైన నెట్వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను క్వాంటం వ్యాలీకి అందించనుంది ఏపీ ప్రభుత్వం.

చదరపు అడుగుకు రూ.30కే అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ను ప్రభుత్వానికి కేటాయించనుంది ఐబీఎం సంస్థ. ప్రభుత్వ సంస్థలు, విద్య పరమైన అంశాలకుగానూ ఈ కంప్యూటింగ్ టైము కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

విట్ యూనివర్సిటీ క్యాంపస్లో రూ.6 కోట్ల వ్యయంతో మరో చిన్న క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది బెంగుళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ క్యూపై ఏఐ. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏమిటి?
A: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థ, ఇది క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు ఒక కేంద్రంగా పనిచేస్తుంది.

AQCC లో ఏ కంపెనీ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తోంది?
A: ఐబీఎం సంస్థ 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తోంది.

క్వాంటం వ్యాలీకి ఎంత భూమి కేటాయించారు?
A: సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాలను కేటాయించింది.

Read Hindi news: Hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/degree-admissions-counseling-deadline-extended/andhra-pradesh/539732/

Amaravati Quantum Computing Center Andhra Pradesh Technology News AP News BM Quantum Computer India Latest ap news Latest Telugu News Quantum Computing in Andhra Pradesh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.