हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Tirupati: గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు.. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం

Anusha
Latest News: Tirupati: గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు.. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నగరాల విస్తరణ, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పురోగమిస్తున్నాయి. వాటిలో భాగంగానే తిరుపతి (Tirupati) ని గ్రేటర్ సిటీగా మార్చే ప్రతిపాదనకు తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తిరుపతి నగర అభివృద్ధికి కీలక మలుపుగా భావిస్తున్నారు.

Liquor case: జోగి రమేశ్ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు

ఇప్పటి వరకూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధి 30.17 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. అయితే, గ్రేటర్ ప్రతిపాదన అమలులోకి వస్తే ఈ విస్తీర్ణం ఏకంగా 283.80 చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే, నగరం దాదాపు పది రెట్లు విస్తరించనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) ఆదేశాల మేరకు.. తిరుపతి మహా నగరపాలికలో తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని 63 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని జిల్లా యంత్రాంగం ఈ ప్రతిపాదనలు చేసింది.

గ్రేటర్ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం

ఈ మేరకు తిరుపతి గ్రేటర్ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతున్నట్లు మేయర్ డాక్టర్ శిరీష ప్రకటించారు.తిరుపతి ఎస్వీయూ (SVU) సెనేట్ హాల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో, కమిషనర్ ఎన్‌.మౌర్య 108 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం లభించింది.

ఈ విస్తరణతో తిరుపతి నగరం విస్తరించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తిరుపతి పర్యటనలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ విస్తరణ అవసరమని సూచించారు. ఈ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనలను రూపొందించింది.

Tirupati
Tirupati

గ్రేటర్ ప్రతిపాదన ప్రభావం

ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత గ్రేటర్ తిరుపతి (greater tirupati) ఏర్పడనుంది.గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలు తాత్కాలికంగా వాయిదా వేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని, మరిన్ని పంచాయతీలను విలీనం చేయాలని కోరారు.

అయితే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు దీనికి అంగీకరించలేదు.. వారు వెంటనే ఓటింగ్‌కు డిమాండ్ చేశారు. మేయర్ శిరీష కో ఆప్షన్ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీల అభిప్రాయాలను సేకరించారు. ఎక్కువమంది సభ్యులు గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడంతో మెజారిటీ సభ్యుల ఆమోదంతో గ్రేటర్ ప్రతిపాదనలను ఆమోదించినట్లు మేయర్ శిరీష ప్రకటించారు.

విలీనమయ్యే ప్రాంతాలు

జనాభా కూడా 4.50 లక్షల నుండి 7.50 లక్షలకు పెరుగుతుంది. వార్షిక ఆదాయం రూ.149 కోట్ల నుండి రూ.182 కోట్లకు చేరుకుంటుంది. చంద్రగిరి, రేణిగుంట వంటి పెద్ద పంచాయతీలు తిరుపతిలో కలిసిపోతాయి. నగరం విమానాశ్రయం దాటి, వికృతమాల వరకు విస్తరించనుంది. ఈ విస్తరణతో తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. 

ఈ మార్పులతో తిరుపతి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అయితే గ్రేటర్ తిరుపతి ఏర్పాటు విషయంలో భౌగోళికంగా ప్రజలకు గానీ, అధికార యంత్రాంగానికి గానీ అసౌకర్యం కలగని రీతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మేరకే గ్రేటర్ తిరుపతికి ప్రతిపాదనలు పంపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870