📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Government Job: 50 సార్లు విఫలం.. చివరకు సర్కార్‌ కొలువు కైవసం..

Author Icon By Rajitha
Updated: December 19, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘పట్టు పట్టరాదు.. పట్టి విడువ రాదు’ అనే వేమన (vemana) మాటలను తన జీవితంలో అక్షరాలా అమలు చేసి చూపాడు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన అండిబోయిన అశోక్‌. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఏకంగా 50 సార్లకు పైగా విఫలమైనా, ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన కలను వదలకుండా, పట్టుదలతో ముందుకు సాగి చివరకు సర్కార్ కొలువును కైవసం చేసుకున్నాడు.

Read also: AP: డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

Government Job

21 ఏళ్ల వయసు నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ

అశోక్ తండ్రి విష్ణు టైలర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి ఆదిలక్ష్మి గృహిణి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన అశోక్ మొదట ప్రైవేట్ ఉద్యోగం ఆలోచించినా, దీర్ఘకాల భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని నిర్ణయించుకున్నాడు. 21 ఏళ్ల వయసు నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఆర్‌ఆర్‌బీ, బ్యాంకులు, ఎస్‌ఎస్‌సీ, ఏపీపీఎస్సీ వంటి అనేక పరీక్షలు రాశాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం మూడు మార్కుల తేడాతో చేజారడం సహా, ఆరు ఉద్యోగాలు స్వల్ప మార్కుల తేడాతో దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేశాయి.

అయితే ప్రతి దశలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుడు దీపక్ ఇచ్చిన ఆర్థిక సహకారం అశోక్‌కు ధైర్యం ఇచ్చాయి. ఏడేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించిన తర్వాత, ఇటీవల జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో అశోక్ ఎంపికయ్యాడు. తన కష్టం ఫలించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అశోక్ చెప్పాడు. ఈ రోజు అతడి కథ వేలాది నిరుద్యోగ యువతకు ఓ సజీవ ప్రేరణగా నిలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Government Job Inspiration Story latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.