ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) ప్రకాశం జిల్లాలో పర్యటించిన సమయంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో భయం, అపోహలు పెరగకుండా స్పష్టత కల్పిస్తూ, కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదని తెలిపారు.
ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి కౌంటర్
గత ప్రభుత్వంలో పాలకులు విద్యుత్ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను శుభ్రం చేయడానినే తమకు సమయం సరిపోతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా వాడుకుందని ఆయన రోపించారు. యాక్సిస్ ఎనర్జీ యూనిట్‌కు రూ.5.12లకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని సవరించి రూ.4.60లకే యూనిట్ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని ఆయన అన్నారు. ప్రజలపై ఎక్కవ భారం పడకుండా వారికి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వాస్తవాలు తెలిసుకోకుండా ప్రభుత్వం బడ్జెట్‌కు భారమయ్యేలా అపోహలు సృష్టించడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అన్నారు.
గత ప్రభుత్వంపై ఆరోపణలు
గత వైసీపీ (YCP) ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా మలచిందని, నిబంధనలను లెక్క చేయకుండా ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే, గత పాలకుల అవకతవకలపై రెడ్ బుక్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
రెన్యూవబుల్ ఎనర్జీ అభివృద్ధికి ప్రాధాన్యం
రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల్లో పునర్వినియోగ విద్యుత్ రాయలసీమ ప్రాంతం రెన్యువబుల్ ఎనర్జీకి అనుకూలంగా ఉంటే ప్రాంతం అని 2014-19లో రెనోవబుల్ ఎనర్జీ ద్వారా 7 వేల మెగావాట్ల ఉత్పత్తిని చేసి చూపించాంమని ఆయన తెలిపారు. ది రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు అని అన్నారు.
Read also: Pawan Kalyan: నర్సుల సేవలు కొనియాడిన పవన్ కల్యాణ్