हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Yarlagadda Venkatrao: గూగుల్ ఏపీకి గేమ్ ఛేంజర్ : ఎమ్మెల్యే యార్లగడ్డ

Aanusha
Latest News: Yarlagadda Venkatrao: గూగుల్ ఏపీకి గేమ్ ఛేంజర్ : ఎమ్మెల్యే యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. తాజాగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao) వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, “వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు అందించినదేమిటి? వారు తీసుకువచ్చింది కోడిగుడ్డే అయితే, తెలుగుదేశం పార్టీ గూగుల్‌ (Google) ను తీసుకువచ్చింది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: AP Liquor shop: లిక్కర్ షాపుల వద్ద కొత్త రూల్స్ అమలు

యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao) మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అభివృద్ధి అనే మాటే లేనట్టైందన్నారు. రాష్ట్రం అప్పులపాలైందని, ప్రతి కుటుంబం ఆర్థిక భారంతో నలిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “గత మూడు రోజులుగా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ వారు ఏమాత్రం స్పష్టంగా మాట్లాడటం లేదు. రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పాల్సింది పోయి, వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతున్నారు,” అని ఆయన విమర్శించారు.

వారి మాటలను ఒకసారి శాంతంగా చూసి, రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అక్టోబర్ 14, 2025 ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) చరిత్రలో చారిత్రాత్మక రోజు” అని అన్నారు.గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ హబ్‌ని విశాఖలో స్థాపించేందుకు కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు.

Yarlagadda Venkatrao
Yarlagadda Venkatrao

ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఐదేళ్లలో

మన రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ. 3,22,000 కోట్లు ఉంటే, సగటున ప్రతి సంవత్సరం రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఐదేళ్లలో ఇది రూ. 32,000 కోట్లు వంటి పెద్ద అంకెలకు చేరుతుందని అన్నారు. ఇలాంటి పెట్టుబడిని దేశంలో మొట్టమొదటిసారిగా గొప్ప స్థాయిలో ఆకర్షించడం విషయంలో కొందరు విమర్శలు ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నించారు.

దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, ఇలాంటి గూగుల్ డేటా హబ్ (Google Data Hub) ఆంధ్రకు వెళ్లిందేంటని చాలా రాష్ట్రాలు బాధపడుతున్నాయని ఆయన అన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని వైసీపీ విమర్శించడం బాధాకరమని అన్నారు. “మనకి ఏదైనా తెలియకపోతే గూగుల్ చేస్తాం. డేటా ఇస్తే తీసుకుంటాం.

మీరు ఇలా మాట్లాడటం సరికాదని

అటువంటి గూగుల్ మన రాష్ట్రానికి వస్తే ఊరు, పేరు లేని కంపెనీ వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు? 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది” అని అన్నారు.లోకేశ్ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, దానిని ఎలా అడ్డుకోవాలనే దుష్ట ప్రయత్నాలే వైసీపీలో కనిపిస్తున్నాయని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదనే అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో 15 మిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చినప్పుడు మీరు నోరు మూసుకుని, ‘వెల్‌కమ్ టూ ఏపీ గూగుల్’ అని బోర్డు చూపిస్తే ప్రజలు సంతోషించేవారిని వెంకట్రావు అన్నారు. దానికి బదులుగా కాకి గోల చేస్తున్నారని విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870