ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు(Ration Card)ల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)కీలక ప్రకటన చేశారు. కొత్తగా రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చుకోవాలంటే పెళ్లి కార్డు తప్పనిసరి కాదు అని స్పష్టంగా తెలిపారు. కొన్నిచోట్ల అధికారులు పెళ్లి కార్డు లేకపోతే దరఖాస్తులను తిరస్కరిస్తుండటంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఆయన, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
విడిపోయిన దంపతులకు రేషన్ కార్డు
భార్యా-భర్తల మధ్య విడాకులు తీసుకున్న వారికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. విడిపోయిన దంపతులు ఏడేళ్లకు పైగా వేర్వేరుగా ఉంటే, వారు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులకు అర్హులవుతారని ప్రకటించారు. దీనివల్ల తమకు కావలసిన రేషన్, ఇతర ప్రభుత్వ పథకాల్లో మద్దతు పొందడంలో వీరికి సౌలభ్యం కలుగుతుంది. ప్రభుత్వ చర్యల వల్ల నిజంగా అర్హులైనవారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.
పలు సాంకేతిక సమస్యలు
ఇకపోతే, ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రి అంగీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే దరఖాస్తుల గడువును పొడిగించే అవకాశముంది అని పేర్కొన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నిజమైన లబ్దిదారులకు రేషన్ కార్డులు అందుతాయని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.
Read Also : Asim Munir : ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు ప్రమోషన్ : పాకిస్థాన్