📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: Visakhapatnam: పర్యాటకులకు శుభవార్త.. విశాఖపట్నంలో కొత్త రోప్‌వే

Author Icon By Anusha
Updated: November 12, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం (Visakhapatnam) పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నగరానికి చిహ్నంగా నిలిచిన కైలాసగిరి రోప్‌వేను ఆధునీకరించడానికి, కొత్త సాంకేతికతతో కూడిన రోప్‌వేను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Also: Chandrababu: రాష్ట్రంలో ఒకేసారి 3లక్షల గృహ ప్రవేశాలు

ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ (Visakhapatnam) ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మలచాలన్నది వీఎంఆర్‌డీఏ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న రోప్‌వే (ropeway) దాదాపు 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్నది. కాలక్రమేణా రోప్‌వే మౌలిక సదుపాయాలు పాతబడడంతో, పర్యాటకుల భద్రత దృష్ట్యా కొత్త సౌకర్యాలను అందించాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ కొత్త ప్రాజెక్టుకు రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. టెండర్ల ప్రక్రియకు అడుగులు ముందుకు పడలేదు.తెన్నేటి పార్కు నుంచి రోప్‌వే పెట్టాలని అనుకున్నామన్నారు వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్. ఈ రోప్‌వే ప్రాజెక్టుకు మొదట లూజ్‌ గ్రావిటీ రైడ్‌ను కూడా జోడించాలని భావించారు. అయితే, ఈ రైడ్‌ వల్ల పెద్దగా లాభాలు రావని అధికారులు అంచనా వేశారు.

ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా

అందుకే, ఆ రైడ్‌ను తీసేసి, కేవలం రోప్‌వేను మాత్రమే తెలుగు మ్యూజియం వరకు నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

అందుకే ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించి, మళ్లీ టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని ఇంజనీరింగ్‌ అధికారులకు వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులకు సూచించామన్నారు.అప్పుఘర్ సమీపంలో 2004 మే 5న ప్రారంభమైన ప్రస్తుత రోప్‌వే 375 మీటర్ల పొడవు ఉంది. దీనిని రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.

తెన్నేటి పార్కు నుంచి కొండపైకి వెళ్తుంది

360 డిగ్రీల కోణంలో నగరాన్ని చూస్తూ కైలాసగిరిపైకి వెళ్లేలా దీనిని బీఓటీ (బిల్డ్, ఓన్, ట్రాన్స్‌ఫర్) విధానంలో అప్పగించారు. 20 ఏళ్ల కాలపరిమితి పూర్తవడంతో, అధికారులు కొత్త రోప్‌వే నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈసారి కేవలం రోప్‌వేనే కాకుండా, లూజ్ గ్రావిటీ రైడ్‌ను కూడా జోడించి టెండర్లు ఆహ్వానించారు.

కొత్త డిజైన్ ప్రకారం, రోప్‌వే అప్పుఘర్ నుంచి కాకుండా తెన్నేటి పార్కు నుంచి కొండపైకి వెళ్తుంది. అక్కడి నుంచి తెలుగు మ్యూజియం వరకు మరో రోప్‌వే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.మొత్తం రోప్‌వే పొడవు 1.5 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆదాయం పెద్దగా రాదని సూచనలు చేశారు

కొండ పైనుంచి భూమి ఆకర్షణ శక్తితో కిందికి వచ్చేలా లూజ్ గ్రావిటీ రైడ్‌లను కూడా ఏర్పాటు చేయాలని గత ఆగస్టులో టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టును పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. దీనికి రూ.60 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, అధికారులు ఆశించినట్లుగా టెండర్లు రాలేదు.

కేవలం ఒకే ఒక్క టెండర్ వచ్చింది. మరికొందరు గడువు పెంచాలని, వ్యయం ఎక్కువ అవుతుందని, ఆదాయం పెద్దగా రాదని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో, వీఎంఆర్‌డీఏ అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Kailasagiri modernization latest news ropeway project Telugu News Visakhapatnam Tourism VMRDA development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.