ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్‌లకు దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం (AP Government) శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా 2014–2019 మధ్యలో, అంటే గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను పరిశీలించి విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్న కాంట్రాక్టర్‌లకు ఊరట లభించనుంది.
CBN : నేడు విజయనగరంలో పర్యటించనున్న సీఎం

ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ఆదేశాలపై స్పందించిన ఆర్థిక శాఖ, బకాయిల చెల్లింపులకు సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది. బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు రూ.400 కోట్ల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి.
ఇప్పటికే పలు దఫాలుగా చెల్లింపులు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున బకాయిల చెల్లింపులను ప్రారంభించింది. చిన్న కాంట్రాక్టర్ల ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లో బిల్లుల సొమ్ము జమ కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: