📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Gold : కనకం ఇక గగనమే!

Author Icon By Sudha
Updated: October 16, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక కిలో బంగారం మనం వద్ద ఉంటే 2030 నాటికి విలువతో రోల్స్ రాయిస్ కారు కొన చ్చు. 2040లో ఒక ప్రైవేట్ విమానమే కొనవచ్చు. ప్రముఖ వ్యాపారవేత్త సియట్, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా వివరించిన పసిడి పలు కులు ఇవి. రోజురోజుకీ పెరుగుతున్న బంగారం (Gold) ధర విషయం లో వస్తున్న అంచనాలివి. ఇంట్లో బోలెడంత డబ్బు మూలుగుతూ, ఎడాపెడా చేతినిండా సంపాదిస్తున్న ‘నియో రిచెస్ కయితే ఈ వ్యాఖ్యలు ఎంతో ఆనందంగా చెవిన తాకుతాయి. వారు జాగ్రత్తపరులు కనుక వారికి అదృష్టం పట్టినట్లే!. తాజా పరిస్థితుల్లో బంగారం (Gold) మీద పెట్టే పెట్టుబడులకు మంచి భద్రత ఉందన్న మాట ఎవరూ కాదనలేనిది. బంగారం పెరుగుతుందో పెరగదో, ఒక వేళ తగ్గుతుందా, ఎలాంటి పరిస్థితుల్లో తగ్గుతుంది, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఎలా జాగ్రత్త పడాలి? అన్న అంశాలపై పూర్తి అంచనా, విశ్లేషణలు అవసరం. అప్పుడే బంగారం లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. వీటిపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. మార్కెట్ విశ్లేషకుల సమీక్షల ప్రాతిపదికగా బంగారం (Gold) పెరుగుతుం దనో, తగ్గుతుందనో ఊహించడమంటే అదొక లాటరీ భావనే. కొందరైతే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని విశ్లేషణలు గమనిస్తే కిలో బంగారం ఖరీదు బాగా తగ్గు తుంది. కనుకఅంతవరకు ఆగితే ఒళ్లంతా బంగారమేనని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ తగ్గితే ఆడవారికి ఊరటే. మరో పక్కన ఆకాశం పైకెగురుతున్న ధర నేలచూపులు చూసే అవకాశమే ఉండదని నిట్టూరుస్తున్నారు. అందుకోలేని ధరల గురించి చెప్పు కుని బాధపడాల్సిందే! ప్రధా నంగా దుబాయ్ వంటి అరబ్ దేశాలలో, భారతదేశంలో మహిళలు బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకుని ధరించేందుకు మోజు పడ తారు. అలా బంగారాన్ని దాచుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇంటి నిండా సంపదే! ఎందుకంటే కాస్త బంగారం ఉన్నా ప్రత్యామ్నాయ పెట్టు బడులకు ఉపయోగపడుతు న్నాయి. వాటిపై బ్యాంకు రుణాలిస్తున్నాయి. మానవారి అవసరాలు తీరుతున్నాయి. ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలన్నా వారిని బంగారమే నిలబడుతోంది. బంగారం మీదవచ్చే రుణ పరపతి కూడా ముఖ్యమే! సామాన్యులకు దూరమవు తున్న బంగారం సంపన్నులకు చేరువవుతోందని చెప్ప లేం. ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు రికార్డుల్ని తిరగ రాస్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధర చుక్కలు తాకుతోంది. అంతర్జాతీయ పరిణామాలు,పండగ, పెళ్లిళ్ల సీజన్ కలిసొచ్చి పసిడి దూసుకెళ్తాంది. బుధవారం నాడు హైదరాబాద్లో రూ.1.30 లక్షలు దాటింది. మంగళవారం ఒక్కరోజే తులం రేటు దాదాపు రూ.3వేలు ఎగబాకింది. ఫలితంగా తులం బంగారం రూ.1.30 లక్షలు దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.3 శాతం స్వచ్ఛత కల 30 వేల ఎనిమిది వందలు చేరింది మరోవైపు వెండి ధర కూడా 1లక్షా 55వేలు తగ్గింది పండుగ సీజన్ సందర్భంగా జువెలరీలు రిటైలర్ నుంచి డిమాండ్ పెరగడంతో ఈ పెరుగుదలకు కారణం అని చెప్తున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం హైదరా బాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.2,720 పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,830కి ఎగబా కింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,21,150 గా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ఒక్కరోజులోనే రూ.3వేలు పెరిగి రూ.1,86,200కి చేరింది. ఏడాది క్రితం ఇదే రోజున 78వేలు ఉన్న 10 గ్రాముల బంగారం రేటు తాజాగా రూ.1.3 లక్షలకు చేరింది. 2022లో పోలిస్తే మొత్తం పెరుగుదల 140 శాతానికి చేరుకుంది. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రద మని దేశ ప్రజల విశ్వాసం. అయితే మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆనా టికి రేట్లు ఇంకా పెరిగిపోవచ్చన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే 24 క్యారెట్ గోల్డ్ 10గ్రాములు రూ.1లక్షా 50వేలు దాటి పోవచ్చునన్నది బులియన్ వర్గాల అంచనా. అటు వెడి ధర కూడా భారీగా పెరుగుతోంది. హైదరా బాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,85,763గా ఉంది. అంతర్జాతీయ విపణిలోనూ పసిడి ధర విపరీ తంగా పెరుగుతోంది. ఔన్సు ధర 4.115 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 51 డాలర్లు దాటింది. అమెరికా షటౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యూఎన్ చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి పరిణా మాలతో బంగారంలో పెట్టుబ డులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమం లోనే గోల్డ్ వెండికి గిరాకీ విపరీతంగా ఉంటోంది. సెప్టెం బరులో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (గోల్డ్ ఈటీఎఫ్)లో నిధుల ప్రవాహం పెరిగింది. ఆగస్టులో వీటిలోకి రూ.2,190 కోట్ల పెట్టుబడులు రాగా, సెప్టెంబరులో ఈ మొత్తం నాలుగింతలై రూ.8.363 కోట్లకు చేరింది. మరోవైపు, ధనత్రయోదశితో పాటు రాబోయే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడికి మరించి డిమాండ్ ఉంటుందని మార్కెట్ సిద్ధమవుతోంది. భౌతిక రాజకీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల కారణంతో ఈ ఏడాది ఇంతవరకు బంగారం ధర 67 శాతం పెరిగింది. మార్కెట్ అనిశ్చితులు ఇలాగే ఉంటే బంగారం మోజు తగ్గించుకోవడమే శ్రేయస్కరం. ఒకప్పుడు షేర్ మార్కెట్ మీద ఇలాంటి అంచనాలతో జనం పెట్టుబడిపెట్టేవారు. బంగారాన్ని ఆ ఇంటి ఇల్లాలు ఆభరణంగా దాచుకుంటే సరే. ఎప్పటికీ దాని మన్నిక మారాదు. కాని పెట్టుబడులు కని బంగారం కొంటే ఒకవేళ కొన్ని విశ్లేషణలకు లోబడి ఏమాత్రం ధర తగ్గినా మనిషి దిగాలుపడతాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Economy Gold prices gold rate Investment latest news precious metals Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.