📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Telugu News: Gold Mines: కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

Author Icon By Pooja
Updated: December 14, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో సామాన్యులకు కొంత ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో బంగారు గనుల (Gold Mines) తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరిగితే భవిష్యత్తులో ధరలపై నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also:  AP: స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్

Gold mining operations have begun in Kurnool.

జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ తవ్వకాలు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో ‘జియో మైసూర్’ సంస్థ బంగారు తవ్వకాలను చేపట్టింది. జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల చుట్టుపక్కల బంగారు(Gold Mines) నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గతంలోనే గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుమారు 1,477 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది.

ఒక్క టన్ను మట్టిలో 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం

అధికారుల అంచనాల ప్రకారం ఒక టన్ను ఖనిజ మట్టిని శుద్ధి చేస్తే 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశముంది. దీనికి సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. అలాగే వెయ్యి టన్నుల ముడి ఖనిజం నుంచి దాదాపు 700 గ్రాముల బంగారం వెలికితీయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

పదేళ్లలో వేల టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రాబోయే పదేళ్లలో సుమారు 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని జియో మైసూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో మొత్తం మీద కోటి టన్నుల వరకు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా తూర్పు బ్లాక్‌లో భూమికి సుమారు 180 మీటర్ల లోతులో 6.8 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అధునాతన యంత్రాలతో రోజుకు వెయ్యి టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News Google News in Telugu Jonnagiri Gold Kurnool District Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.