📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

gold : విజయవాడలో బంగారు బిస్కెట్ల స్కీం పేరుతో కోట్ల మోసం!

Author Icon By Divya Vani M
Updated: May 29, 2025 • 8:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలో (In Vijayawada) చీటీ స్కీమ్ పేరుతో భారీ మోసం జరిగింది. పాడితే బంగారం బిస్కెట్లు అని చెప్పి, చివరికి కోట్ల రూపాయలతో పారిపోయాడు ఓ వ్యక్తి.అయోధ్యనగర్‌కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్‌ (Mucharla Srinivas) ఈ మోసం చేశాడు. మొదట పచ్చళ్ల వ్యాపారం చేస్తూ స్థానికులతో సంబంధాలు పెంచుకున్నాడు. అంతకుముందు కూడా చీటీలు వేసి నమ్మకం సంపాదించాడు.బంగారం ధరలు పెరుగుతుండగా శ్రీనివాస్ ఓ కొత్త స్కీమ్ అందించాడు. ఈ పథకంలో 25 మంది సభ్యులు ఉండేవారు. ప్రతినెలా 5 గ్రాముల బంగారానికి సమానంగా డబ్బులు చెల్లించాలి.ప్రతి నెలా పాట నిర్వహించి గెలిచినవారికి 125 గ్రాముల బంగారం ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ, ఆ గెలిచినవారు ఇకపై నెలకు అదనంగా 3 గ్రాములకు డబ్బులు చెల్లించాలి.ఇలా నెలలుకుసరుగుతూ, బంగారం పరిమాణం పెరుగుతుందని చెప్పాడు. 125 గ్రాములు, 128 గ్రాములు, 131 గ్రాములు ఇలా గోల్డ్ పెరుగుతుందని చెప్పాడు.

gold : విజయవాడలో బంగారు బిస్కెట్ల స్కీం పేరుతో కోట్ల మోసం!

మంచి లాభం వచ్చేది అనుకుని..

ఆఫర్ ఆకర్షణీయంగా ఉండటంతో సభ్యులు వెంటనే జంప్ అయ్యారు. ఎక్కువ బంగారం వస్తుందనే ఆశతో పాట పాడుకోకుండా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు.వారి నమ్మకాన్ని తన లాభంగా మార్చుకున్నాడు శ్రీనివాస్. చివరికి స్కీం చివరి దశకి రాగానే విషయం తేలింది.

బోర్డు తిప్పిన వ్యాపారి – లక్షల్లో మోసం

ఇప్పుడు సభ్యులకు పెద్ద మొత్తంలో బంగారం ఇవ్వాల్సి వచ్చింది. అయితే అంత బంగారం ఇవ్వడం సాధ్యం కాదని గ్రహించి శ్రీనివాస్ పరారయ్యాడు.చలువాది లక్ష్మణుడు అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. “నాకు ₹1 కోటి విలువైన బంగారం ఇవ్వాల్సి ఉంది,” అన్నారు.

పోలీసుల దర్యాప్తు, బాధితుల ఆవేదన

అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద 65 మంది బాధితులు ఫిర్యాదు చేసారు. శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.ఈ మోసంలో సుమారు ₹10 కోట్ల నష్టం ఉన్నట్లు భావిస్తున్నారు. కేసును విచారిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పట్టుబడితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.ఎంతమంది బాధితులున్నారు, ఎంత బంగారం ఇవ్వాల్సి ఉంది అన్నదానిపై క్లారిటీ వస్తుంది.

Read Also : YS Jagan : మహానాడుపై జగన్ కామెంట్స్

Andhra gold fraud case Ayodhya Nagar fraud news Fake chit scheme in Andhra Pradesh Gold scam Vijayawada Police investigation on gold scam Scam victims in Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.