Godavari Drowning Incident: గోదావరి ఘటన.. చావు లోను వీడని స్నేహం

Read Time:  1 min
Godavari Drowning Incident: గోదావరి ఘటన.. చావు లోను వీడని స్నేహం
FONT SIZE
GET APP

Godavari Drowning Incident: కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన నవదీప్ (19), తేజసాయి (20) ప్రాణ స్నేహితులు. అమరావతిలో ఇంజినీరింగ్ చదువుతున్న వీరు, ఉగాది, వరుస సెలవులు ఉండటంతో భద్రాచాలానికి చెందిన స్నేహితులతో టూర్‌కి వెళ్లారు. గోదావరి నదిలో స్నానానికి దిగారు. ఉధృతి ఎక్కువగా ఉండటంతో నది కొట్టుకుపోయి మృతి చెందారు. దాంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.

Read Also : Moinabad Drugs Case Update: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

Godavari Drowning Incident: గోదావరి ఘటన.. చావు లోను వీడని స్నేహం
Godavari Drowning Incident: Godavari incident.. A friendship that will not leave even in death

అసలేం జరిగింది?

ఏటపాక మండలం కొల్లూగూడెం పోలవరం జిల్లా, ఏలూరుజిల్లా కుక్కునూరు మధ్య ఏడుగురు బిటెక్ విద్యా ర్థులు శుక్రవారం గోదావరి నదిలో గల్లంతు అయ్యారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే గాలింపు బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయటంతో ముగ్గురి మృత దేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటనకు సంభందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉగాది సెలవులు కావటతో ఏడుగురు స్నేహితులు కలిసి శుక్రవారం భద్రాచలం శ్రీసీతారాంచంద్ర స్వామిని దర్శనం చేసుకున్నారు. భద్రాచలం నుండి కారులో ఏటపాక మండలం కొల్లూగూడెం ఇసుక ర్యాంప్ వద్దకు చేరుకొని, ఇసుక ర్యాంప్ సమీపంలో కారును ఆపి గోదావరి ఇసుకలో రెండు కిలోమీటర్లు నడిచి కుక్కునూరు వైపుకు ఉన్న నది ప్రవాహం వద్దకుచేరుకున్నారు.

అక్కడ ఫొటోలో దిగుతుండగా ఒకరు నదిలోకి జారీ పోవటంతో ఒకరి కోసం ఒకరు మొత్తం నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఐదుగురు మునిగిపోయారు. ఇద్దరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరు కొని పోలీసులకు సమాచారం చేరవేశారు.అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీలో బిటెక్ రెండో సంవత్సరం చదు వుతున్న ఐదుగురు విద్యార్థులు నవదీప్, సతీష్ కుమార్, తేజసాయి, దీపక్, హర్షవర్ధన్లు భద్రా చలంలోని తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి ఏటపాక మండలం లోని పురుషోత్తమపట్నం గ్రామ శివారులో ఉన్న కొల్లి గూడెం ఇసుక ర్యాంప్ సమీపంలోని గోదావరినది లోకి దిగి ఫోటోలు తీసు కుంటూ ఉండగా ప్రమాదం చోటచేసుకుంది. ఏడుగురు యువకులు అకస్మా త్తుగా ప్రవాహంలో మునిగి పోగా ఇద్దరికి ఈత రావడంతో ప్రాణాలతో బయట పడ్డారు. మిగి లిన ఐదుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ అనంతరం మూడు మృత దేహాలు లభ్యమయ్యయీ, ఇంకా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీ ప్లలుగా గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారు. శ్రీకర్, అభిరామ్, ఉయ్యూరుకు చెందిన నవదీప్ మృతదే హాలు లభ్యమయ్యాయి. సతీష్ కుమార్, తేజసాయి కోసం గాలింపు కొనసాగుతుంది. ఘటన స్థలాన్ని చింతూరు ఏఎస్పి హేమంత్, యాటపాక, కుక్కునూరు, భద్రాచలం పోలీ సులు చేరుకొని సహాయక చర్యలు చెపట్టారు. పండగ పూట విషాదం విద్యార్థుల కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.