📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Geophysical survey: తుది అంకానికి ఎస్ఎల్బిసి జియోఫిజికల్ సర్వే

Author Icon By Sushmitha
Updated: November 13, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

14 వరుసలుగా సొరంగం విభజించి హెలికాఫ్టర్ సర్వే

హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్ఎల్బీసీ)(SLBC) భూభౌతిక పరిస్థితి అధ్యయనం కోసం చేస్తున్న హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే(Geophysical survey) దాదాపు తుది అంకం చేరుకుంది. ప్రత్యేక హెలికాప్టర్ మన్నెవారిపల్లి అవుట్‌లెట్ నుంచి దోమలపెంట ఇన్‌లెట్ వరకు తిరుగుతూ సర్వే చేస్తుండటంతో, త్వరలో శాస్త్రజ్ఞులు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సర్వేను నేషనల్ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పది రోజులుగా నిర్వహిస్తున్నారు.

Read Also: TG: తెలంగాణలో ఇంటర్నేషనల్ ఫిషరీస్‌ హబ్‌ ఏర్పాటు

Geophysical survey

సర్వే విధానం, లోతు

ఈ సర్వే కోసం హెలికాప్టర్(Helicopter) ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వేళలలో రెండుసార్లు టేకాఫ్, ల్యాండింగ్ అవుతోంది. టేకాఫ్ అయిన ప్రతిసారీ ఐదు నుంచి ఎనిమిది చుట్టూ చక్కర్లు కొడుతూ అధ్యయనం చేస్తున్నారు. గాలిలో దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి భూమి లోపల దాదాపు 500 నుంచి 800 మీటర్ల లోతు వరకు విద్యుదయస్కాంత తరంగాలను ప్రసరింపజేస్తూ ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతోంది. సొరంగం ప్రతిపాదిత ప్రాంతాన్ని 14 వరుసలుగా విభజించుకుని, ఒక్కో వరుసలో 100 నుంచి 500 మీటర్ల మధ్య సర్వే చేపడుతున్నారు.

ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, తదుపరి చర్యలు

ప్రమాదం జరిగిన ప్రాంతం, ఇక ముందు తవ్వాల్సిన సొరంగం, అలాగే తవ్వకం పూర్తైన ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం 43 కి.మీ. నిడివిలో సొరంగం అడ్డం సుమారు 3 కి.మీ. పరిధిలో సర్వే చేస్తున్నారు. దీని ద్వారా భూమి లోపల షియర్ జోన్స్ వంటి ప్రమాదకరమైన ప్రాంతాలను, నీటి ప్రవాహాలు, పెళుసైన బురద ప్రాంతాలు వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. త్వరలో ఏరియల్ సర్వే ముగించడమే కాకుండా నవంబర్ 29 లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వే నివేదిక ఆధారంగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం రీడిజైన్ చేసి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 3న ఈ సర్వేను ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

geophysical survey Google News in Telugu Latest News in Telugu National Geophysical Institute Raghunath Reddy SLBC project Srisailam tunnel Telugu News Today underground construction.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.