📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gas Cylinder Theft: ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 6:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gas Cylinder Theft: గతంలో దొంగలు అంటే ఇళ్లలో దూరి బంగారం, వెండి, నగదు కోసం వెతికేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతోనో ఏమో కానీ, గిల్లి దొంగలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై కన్నేస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో ఇలాంటి సిలిండర్ల చోరీలు వెలుగులోకి రాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.

Read Also : Tirupati Police: ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

Gas Cylinder Theft: Gas Cylinder Goes Missing in Dwaraka Tirumala

ఏం జరిగిందంటే..?

ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఒక ఇంటి ఆవరణలో ఈ చోరీ జరిగింది. ఆ ఇంటి యజమానులు పని మీద బయటకు వెళ్తూ ఇంటికి తాళం వేశారు. అయితే, తమ కాంపౌండ్ లోపల ఉన్న గ్యాస్ సిలిండర్‌ను లోపల పెట్టడం మర్చిపోయారు. రాత్రి సమయంలో అదును చూసి ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన దొంగలు, ఆ గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోయారు.బయటకు వెళ్లిన బాధితులు తిరిగి వచ్చి చూసేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చివరకు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ap police Dwaraka Tirumala Eluru News Gas Cylinder Theft Theft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.