Gas Cylinder Theft: గతంలో దొంగలు అంటే ఇళ్లలో దూరి బంగారం, వెండి, నగదు కోసం వెతికేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతోనో ఏమో కానీ, గిల్లి దొంగలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై కన్నేస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో ఇలాంటి సిలిండర్ల చోరీలు వెలుగులోకి రాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.
Read Also : Tirupati Police: ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఏం జరిగిందంటే..?
ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఒక ఇంటి ఆవరణలో ఈ చోరీ జరిగింది. ఆ ఇంటి యజమానులు పని మీద బయటకు వెళ్తూ ఇంటికి తాళం వేశారు. అయితే, తమ కాంపౌండ్ లోపల ఉన్న గ్యాస్ సిలిండర్‌ను లోపల పెట్టడం మర్చిపోయారు. రాత్రి సమయంలో అదును చూసి ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన దొంగలు, ఆ గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోయారు.బయటకు వెళ్లిన బాధితులు తిరిగి వచ్చి చూసేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చివరకు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :