📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gas Cylinder Shortage: విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

Author Icon By Tejaswini Y
Updated: March 13, 2026 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Gas Cylinder Shortage: People rush for gas in Vijayawada

Gas Cylinder Shortage: బెజవాడ నగరంలో గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా సరఫరాలో అంతరాయం కలగడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక, వంట పనులు ఆగిపోతాయన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read also: Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే!

గంటల తరబడి వేచి చూస్తున్న వినియోగదారులు

నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న గ్యాస్ ఏజెన్సీల ముందు ఉదయం నుండే వినియోగదారులు బారులు తీరుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందన్న సమాచారంతో, ఖాళీ సిలిండర్లను వెంటబెట్టుకుని మరీ ఆఫీసుల వద్దకు చేరుకుంటున్నారు. గంటల తరబడి వేచి ఉన్నా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టెక్నికల్ సమస్యలతో తోడైన తిప్పలు

ఒకవైపు సిలిండర్ల కొరత వేధిస్తుంటే, మరోవైపు సర్వర్లు పనిచేయకపోవడం ఏజెన్సీ సిబ్బందికి, ప్రజలకు పెద్ద సవాలుగా మారింది. ఆన్‌లైన్ బుకింగ్స్ మరియు స్లిప్పుల జారీలో ఇబ్బందులు తలెత్తడంతో, ఏజెన్సీ సిబ్బంది మాన్యువల్ గానే స్లిప్పులను రాసి అందిస్తున్నారు. ఇది ప్రక్రియను మరింత నెమ్మదింపజేస్తోంది. మున్ముందు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోతుందేమోనన్న భయం వినియోగదారుల్లో నెలకొంది. ఏజెన్సీల వద్ద రద్దీ పెరుగుతుండటంతో పరిస్థితిని అదుపు చేయడం సిబ్బందికి కష్టతరంగా మారుతోంది. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

AP Gas Crisis Gas Booking Issues Gas Cylinder Shortage LPG Supply Issues Vijayawada Gas Agencies Vijayawada news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.