📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gas Cylinder: గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gas Cylinder: దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత సామాన్యులను కలవరపెడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా చూడటం ,సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా అడ్డుకోవడంపై మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు.

Read Also : Andhra Pradesh: గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Gas Cylinder: Minister Payyavula Keshav Makes Key Remarks on Gas Booking

బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం

గ్యాస్ కొరతను సాకుగా చూపి కొందరు అక్రమార్కులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సరఫరా గొలుసులో (Supply Chain) ఎక్కడా జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఇప్పటికే 88 శాతం మంది వినియోగదారులు ఓటీపీ ద్వారా సిలిండర్లు తీసుకుంటున్నారని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు విధించినట్టు తెలిపారు. డబుల్ సిలిండర్ ఉన్న వారికి 32 రోజుల చొప్పున రీఫిల్ బుకింగ్‌పై పరిమితి విధించినట్లు మంత్రి వివరించారు.

ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ఆసుపత్రులు, హాస్టళ్లు, గృహ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రిఫైనరీలను ఆదేశించిందని, ప్రస్తుతం 10 నుంచి 20 శాతం వరకు ఉత్పత్తి మన దేశంలోనే జరుగుతోందని వెల్లడించారు. హోటల్ అసోసియేషన్లతో కూడా చర్చలు జరుపుతున్నామని, వారు బొగ్గుతో నడిచే తందూరి బట్టీల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని చెప్పారు.

సోలార్ కుకింగ్ విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే స్టీమ్ కుకింగ్ అమలులో ఉందని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో గ్యాస్ ధరలు పెరగకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆర్‌టీజీఎస్ ద్వారా అన్ని బృందాలతో సమావేశమై గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించనున్నారని వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Atchannaidu Gas Supply Latest News in Telugu LPG Gas Shortage AP payyavula keshav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.