📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Onion cover ganja : ఉల్లిపాయల మాటున గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలింపు

Author Icon By Sai Kiran
Updated: February 10, 2026 • 9:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Onion cover ganja : అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతోంది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లె తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ భారీ గంజాయి స్మగ్లింగ్‌ను పోలీసులు సమయానికి గుర్తించి అడ్డుకోవడంతో జిల్లాలో కలకలం రేగింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లె డీఎస్పీ ఎస్. మహేంద్ర పర్యవేక్షణలో తాలూకా ఇన్స్పెక్టర్ కె. కళా వెంకటరమణ బృందం మదనపల్లె–తిరుపతి ప్రధాన రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టింది.

ఈ క్రమంలో నంబర్ లేని లగేజీ ఆటోను తనిఖీ చేయగా, పైన ఉల్లిపాయల బస్తాలు కనిపించాయి. అనుమానం వచ్చి లోతుగా తనిఖీ చేయగా, ఉల్లిపాయల కింద దాచిన తొమ్మిది బస్తాల్లో సుమారు 179 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ.44.65 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

Read Also: Nellore SP Ajitha Vejendla: ఎస్పీకి వినతుల వెల్లువ

Onion cover ganja

ఈ కేసులో మదనపల్లె చంద్రకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఆవుల నాగరాజు, ఆవుల సుగుణలను అదుపులోకి తీసుకుని, వారి పై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “యువతను మత్తుకు బానిసలుగా మార్చే ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తప్పవు. ప్రజలు పోలీసులకు సమాచారం అందించి జిల్లాను డ్రగ్స్‌రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలి” అని పిలుపునిచ్చారు. భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

annamaya district news Breaking News in Telugu cannabis seizure drug trafficking India ganja bust andhra pradesh ganja seizure latest ganja smuggling Google News in Telugu madanapalle crime news madanapalle police ndps act case onion cover ganja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.