Raptadu Girl Incident : ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థినిని పరామర్శించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బాధిత బాలికకు ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ పరిహారం ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తామని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తోందని జగన్ పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : రంపం దాడి ఘటన.. బాలిక స్పృహలోకి వచ్చిందన్న లోకేశ్
మద్యం, గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు
రాప్తాడు ఘటనకు రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉండటమే కారణమని జగన్ ఆరోపించారు. వైన్ షాపుల నిర్వహణ, గంజాయి నియంత్రణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మత్తు పదార్థాల ప్రభావం సమాజంపై, ముఖ్యంగా యువతపై పడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలు, విద్యాసంస్థల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మద్యం, గంజాయి నియంత్రణలో వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని విమర్శించారు. బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆమె కుటుంబానికి తగిన న్యాయం, ఆర్థిక సహాయం అందించాలని జగన్ డిమాండ్ చేయడంతో ఈ ఘటనపై ఏపీ రాజకీయాల్లో చర్చ మరోసారి వేడెక్కింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :