Jammalamadugu: గండికోట ఉత్సవాలు-2026(Gandikota Utsavalu 2026) భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచే గండికోట పర్యాటక క్షేత్రంలో ఉత్సవాల సందడి నెలకొంది. ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జిల్లా యాత్ర పర్యాటకులు స్థానిక ప్రజలతో గండికోట పరిసర ప్రాంతాలు కన్నుల పండువగా ఆహ్లాదకరంగా మారింది.
Read also: Shirdi Visit: శిరిడిలో మంత్రి లోకేష్ దంపతులు
ఉత్సవాల ప్రారంభం మొదటి రోజు కావడంతో ఆసక్తిగా ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లొ కలియతిరుగుతూ సందర్శకులు ఆనందశోభితమయ్యారు. సాయంత్రం వరకు శోభాయాత్రతో ఉత్సవాలు ప్రారంభం కావడంతో పర్యాటక క్షేత్రం ఆహ్లాదకరంగా మారింది. వివిధ రకాల కళా బృందాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్న ఫుడ్ స్టాళ్లు, ఎగ్జిబిషన్ స్టాళ్లు, ఔట్ డోర్ గాడ్జ్, కోట పరిసరాల చూడ ముచ్చటగొలిపాయి.
ఉత్సవాలకు హాజరవుతున్న సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు, కొరత లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పర్యాటకులకు, సందర్శకులకు పూర్తిస్థాయి. భద్రతను కల్పించే విషయంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: