ఏపీ: విశాఖపట్నం గాజువాక(Gajuwaka)లోని జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశం విషాదంగా మారింది. సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి(Heart Attack) చెందడంతో అక్కడ కలకలం నెలకొంది.
Read Also: Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?
సమావేశంలో చర్చలు కొనసాగుతున్న సమయంలో
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. సమావేశంలో చర్చలు కొనసాగుతున్న సమయంలో, మెకానికల్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరావు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే సహచరులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: