📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:G.V. Poornachand: భాషాభ్యుదయం కోసం సంఘటితంగా కృషి చేయాలి

Author Icon By Pooja
Updated: October 18, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : భాషాభ్యుదయం కోసం జరిగే కృషి సంఘటితంగా ఉండాలని ప్రపంచ రచయితల సంఘం జాతీయ(World Writers Association National) కార్యదర్శి డా. జి.వి. పూర్ణచందు(G.V. Poornachand) ఉద్ఘాటించారు. మాతృభాష పరిరక్షణకు అందరు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మహా సంకల్పంతో, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సహకారంతో మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ నిర్వహణలో నవంబరు 22, 23 తేదీలలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు ఆహ్వానించడం కోసం శుక్రవారం విజయవాడలో ప్రపంచ రచయితల సంఘం కార్యదర్శి, శతాధిక గ్రంథకర్త డా. జి.వి.పూర్ణచందుని ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కలిమిశ్రీ కలిశారు.

Read Also: Atchannaidu: శనగ రైతును ఆదుకుంటాం

G.V. Poornachand: భాషాభ్యుదయం కోసం సంఘటితంగా కృషి చేయాలి

విజయవాడలో సాహిత్యం, సంస్కృతి, కళలు మరింతగా పరిఢవిల్లజేసేందుకు తలపెట్టిన రెండు రోజుల సాంస్కృతిక మహాయజంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అలాగే ఈ ఉత్సవాల్లో వెలువరించబోతున్న ప్రత్యేక సంచికకు బెజవాడను గురించిన సమాచారంతో వ్యాసం రాయాలని, ప్రపంచ రచయితల మహాసభలు నిర్వహించిన అనుభవంతో మాకు సలహాలివ్వాలని పూర్ణచందుని(G.V. Poornachand) కోరారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ ఉత్సవాలకు రావడానికి పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కలిమిశ్రీ తెలిపారు. అందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన డా. పూర్ణచందు ఈ సాంస్కృతిక మహోత్సవాలను విజయవంతం చేయడంలో తన వంతు సహకారాన్ని అందిస్తానని, అలాగే ప్రత్యేక సంచికకు ఇంతకు ముందు ఎవరూ రాయనటువంటి అరుదైన సమాచారంతో మంచి వ్యాసం రాసి పంపుతానని ధైర్యాన్నిచ్చారు. ఈ కలయికలో సీనియర్ జర్నలిస్ట్ డి.స్వాతి, ఉత్సవాల కమిటీ బాధ్యులు చొప్పా రాఘవేంద్రశేఖర్, పి.చిదంబరం, వై.డి. ఆనంద్ పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Cultural Promotion Language Development Latest News in Telugu telugu language Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.